NTV Telugu Site icon

IND vs ENG: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. సుర్యకుమార్ వ్యూహం ఇదే..

Ind Vs Eng

Ind Vs Eng

భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ బుధవారం నుంచి ప్రారంభమైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో తొలి టీ20 జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్‌ ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. భారత్, ఇంగ్లండ్‌లు చివరిసారిగా 2022లో టీ20 సిరీస్ ఆడాయి. ఆ తర్వాత ఇంగ్లండ్‌లో భారత్ 2-1తో ఇంగ్లండ్ జట్టును ఓడించింది. తాజాగా జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు కమాండ్ సూర్యకుమార్ యాదవ్ చేతిలో ఉండగా, ఇంగ్లండ్ పగ్గాలు జోస్ బట్లర్ చేతిలో ఉన్నాయి. ఈ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ చాలా కాలం తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నాడు. అతను నవంబర్ 2023లో భారత్ తరపున తన చివరి మ్యాచ్ ఆడాడు. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత షమీ మడమకు శస్త్రచికిత్స అయ్యింది.

READ MORE: Davos: ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్‌, ఫడ్నవీస్‌..

“ఇది మంచి మైదానం. భారత్‌తో ఆడడం గౌరవంగా భావిస్తున్నాను. అందరూ మంచి స్థానంలో ఉన్నారు. రెండు వైపులా క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభ కలిగి ఉన్నారు. ఇది ఒక సవాలుగా ఉంటుంది. ఈ సవాలు కోసం మేము సిద్ధంగా ఉన్నాం.” అని జోస్ బట్లర్ అన్నాడు. “ముందుగా బౌలింగ్ చేయాలని చూశాం. ఎందుకంటే రాత్రి అవుతున్న కొద్ది మంచు కురుస్తుంది. అప్పుడు బ్యాటింగ్‌కి ప్రాబ్లమ్ అవుతుంది. మా టీం అద్భుతంగా ఉంది. రెండు టీంల మధ్య తీవ్ర పోటీ ఉంటుంది. ఈ సిరీస్ కైవసం చేసుకునేందుకు చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.” అని సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు.

READ MORE: Congress: దావోస్‌ వెళ్లని కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం.. విభేదాలే కారణమని బీజేపీ ఆరోపణ..

కాగా.. 14 ఏళ్ల తర్వాత ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20 మ్యాచ్ జరగుతుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇప్పటివరకు భారత జట్టు మొత్తం 8 టీ20 మ్యాచ్‌లు ఆడగా, అందులో ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ అసంపూర్తిగా ముగిసింది. ఈ గడ్డపై టీమిండియా ఓడిన ఏకైక మ్యాచ్ ఇంగ్లండ్‌తో మాత్రమే. 29 అక్టోబర్ 2011న ఈడెన్ గార్డెన్స్‌లో టీమ్ ఇండియా తన మొదటి టీ20 మ్యాచ్ ఆడింది. యాదృచ్ఛికంగా ఈ మ్యాచ్ ఇంగ్లండ్‌తో జరిగింది. ఈ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో భారత జట్టును ఓడించింది.