Site icon NTV Telugu

IND vs ENG: విరాట్ కోహ్లీని ట్రోల్‌ చేసిన ఇంగ్లండ్ ఫాన్స్.. గట్టిగా ఇచ్చిపడేసిన భారత అభిమానులు!

Untitled Design (3)

Untitled Design (3)

Barmy Army slammed by India Fans for Trolling Virat Kohli: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం లక్నో వేదికగా జరిగిన భారత్, ఇంగ్లండ్‌ మ్యాచులో అభిమానులు ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ చేసిన ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముందుగా ఇంగ్లండ్ ఫాన్స్ ట్రోల్‌ చేయగా.. ఆపై భారత్ ఫాన్స్ గట్టిగా ఇచ్చిపడేశారు. ఇంగ్లండ్‌పై అద్భుత రికార్డు ఉన్న భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఆ జట్టు ఫాన్స్ టార్గెట్ చేశారు. ఇది చుసిన టీమిండియా అభిమానులు బెన్ స్టోక్స్, జో రూట్‌లను ట్రోల్స్ చేశారు. విషయంలోకి వెళితే…

ఓపెనర్ శుభ్‌మ‌న్ గిల్ పెవిలియన్ చేరిన తరువాత కింగ్ విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. ఇంగ్లండ్‌పై కోహ్లీకి మంచి రికార్డ్ ఉండడంతో.. అతడిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పిచ్ బౌలర్లకు సహకరిస్తుండంతో కోహ్లీ క్రీజులో కుదురుకోవడానికి సమయం తీసుకున్నాడు. అయితే డేవిడ్ విల్లి బౌలింగ్‌లో ఊహించని షాట్ ఆడిన విరాట్.. బెన్ స్టోక్స్ చేతికి చిక్కాడు. 9 బంతులు ఆడిన కోహ్లీ డకౌట్ అయ్యాడు. కోహ్లీ డకౌట్ అవ్వగానే ఇంగ్లండ్ బార్మి ఆర్మీ (England’s barmy army) సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. నీటిలో ఉన్న బాతు తల స్థానంలో కోహ్లీ తలను పెట్టింది. just out for a morning walk అని క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసిన భారత ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Dream Girl Date: డ్రీమ్‌ గర్ల్‌తో మొదటిసారి డేట్‌కు వెళుతున్నా.. మనీ ఇవ్వండి ప్లీజ్! బీజేపీ మంత్రికి వింత విజ్ఞప్తి

229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లను భారత పేసర్లు వణికించారు. జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ బుల్లెట్ బంతులతో ఇంగ్లీష్ బ్యాటర్లను పెవిలియన్ చేర్చారు. స్టార్ బ్యాటర్లు బెన్ స్టోక్స్, జో రూట్ ఇద్దరు ఖాతా తెరువకుండానే పెవిలియన్ బాట పట్టారు. రూట్ గోల్డెన్ డకౌట్ కాగా.. 10 బంతులాడిన స్టోక్స్ ఒక పరుగు కూడా చేయలేదు. దీంతో బాతుల తలల స్థానాల్లో స్టోక్స్, రూట్ తలలను భారత్ ఫాన్స్ మార్ఫ్ చేసి పోస్ట్ చేశారు. just out for a evening walk అని క్యాప్షన్ పెట్టారు. దాంతో ఇంగ్లండ్ ఫాన్స్ షాక్ తిన్నారు.

Exit mobile version