NTV Telugu Site icon

Israel-Lebanon War: భారత్‌ దాతృత్వం.. లెబనాన్‌కు ఇండియా భారీ సహాయం..

India

India

యుద్ధంతో అతలాకుతలమైన లెబనాన్‌కు భారత్ ఆపన్నహస్తం అందించింది. భారత్ నుంచి లెబనాన్‌కు 33 టన్నుల వైద్య సామగ్రిని పంపుతున్నారు. లెబనాన్‌కు మానవతా సహాయాన్ని పంపుతున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. దీంతో భాగంగా ఈరోజు 11 టన్నుల వైద్య సామాగ్రి మొదటి సరుకు పంపబడింది. కార్డియోవాస్కులర్ డ్రగ్స్, ఎన్‌ఎస్‌ఏఐడీ(NSAID)లు (నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్), యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లు, యాంటీబయాటిక్స్, మత్తుమందులతో సహా వివిధ రకాల ఔషధ ఉత్పత్తులను ఈ సరుకులో చేర్చారు. లెబనాన్‌లో కొనసాగుతున్న ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవడానికి సహాయం అందించడానికి భారతదేశం ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వైద్య సహాయం యొక్క స్వభావాన్ని ధృవీకరించింది.

READ MORE: AP Liquor: ఏపీలో జోరుగా మద్యం అమ్మకాలు.. ఇప్పటివరకు ఆదాయం ఎంతంటే?

విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల..
విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో, ఈ సరుకులో గుండె జబ్బులకు మందులు ఉన్నాయని పేర్కొంది. వైద్య సామాగ్రి యొక్క అదనపు సరుకులు త్వరలో పంపబడతాయని.. తక్షణ ఆరోగ్య అవసరాలను నిర్వహించగల దేశం యొక్క సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుందని తెలిపింది. మిగిలిన సామాగ్రి రెండు, మూడో విడతల వారీగా సరుకులును రాబోయే వారాల్లో రవాణా చేయనున్నట్లు భావిస్తున్నారు.

READ MORE: Israel-Lebanon War: భారత్‌ దాతృత్వం.. లెబనాన్‌కు ఇండియా భారీ సహాయం..

వైమానిక దాడులలో ఇప్పటివరకు 2,000 మందికి పైగా మృతి…
ఇదిలా ఉండగా.. హిజ్బుల్లాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులలో ఇప్పటివరకు 2,000 మందికి పైగా లెబనీస్ పౌరులు మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. నిరంతర దాడుల కారణంగా లెబనాన్ వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దక్షిణ బీరుట్‌లోని కొన్ని ప్రాంతాలు ఈ దాడితో పూర్తిగా ధ్వంసమయ్యాయి. అటువంటి పరిస్థితిలో, లెబనాన్‌లో వైద్య సామాగ్రి కొరత ఉంది. భారతదేశం నుంచి ఈ సహాయం దానికి గొప్ప ఉపశమనాన్ని అందిస్తుంది.

READ MORE: Samsung Galaxy A16 5G: శాంసంగ్ నుంచి బడ్జెట్ ఫోన్ లాంచ్.. అదిరిపోయిన ఫీచర్లు

ఇజ్రాయెల్ దాడి కారణంగా లెబనాన్‌లో సంక్షోభం
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడాలని లెబనాన్ గతంలో భారత్‌కు పిలుపునిచ్చింది. భారతదేశంలోని లెబనీస్ రాయబారి రబీ నరష్ లెబనాన్‌కు వైద్య సామాగ్రి కోసం భారతదేశం యొక్క మానవతా సహాయాన్ని ప్రశంసించారు. ఇంతలో, దక్షిణ లెబనాన్‌లో ఉన్న బహుళజాతి శాంతి పరిరక్షక దళం ఇజ్రాయెల్ చర్యను పశ్చిమాసియా దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. బహుళజాతి శాంతి పరిరక్షక దళం దీనిని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 1701 ఉల్లంఘనగా తెలిపింది.

Show comments