పాకిస్తాన్ అగ్ర నాయకుడు, జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం (ఎఫ్) అధ్యక్షుడు మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ పాక్ పార్లమెంట్ లోపల భారతదేశాన్ని ప్రశంసించారు. నేడు భారత్ అగ్రరాజ్యంగా అవతరించేందుకు సిద్ధమవుతుంటే.. ప్రపంచ దేశాల ఆర్థిక సహాయానికి పాకిస్థాన్ సిద్ధంగా ఉందన్నారు. వరల్డ్ బ్యాంక్ తో పాటు ఇతర దేశాల దగ్గర మనం ఆర్థికంగా ఆదుకోవాలని అడుక్కునే పరిస్థితి ఏర్పాడిందని ఆయన విమర్శించారు. ఈ పరిస్థితికి ఎవరు బాధ్యులని మౌలానా ప్రశ్నించారు. పాకిస్థాన్‌లోని రాజకీయ నాయకులు భారత్‌ను ఎంత వ్యతిరేకించినా, భారత్ అభివృద్దిలో మనకంటే చాలా ముందుకెళ్లిందన్న విషయాన్ని వారు అంగీకరించాలన్నారు.
Read Also: Uttam Kumar Reddy: బీజేపీ నోటీసులకు భయపడేది లేదు.. కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
కాగా, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను కీలుబొమ్మలుగా మార్చడం వల్లే దేశం ఈ పరిస్థితిని అదృశ్య శక్తులే కారణమని మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ అన్నారు. పార్లమెంట్ సభ్యులు సూత్రాలను వదిలి ప్రజాస్వామ్యాన్ని అమ్ముకోవడంలో నిమగ్నమై ఉన్నారని ఆయన మండిపడ్డారు. పార్లమెంటు నిజంగా ప్రజల ఆదేశాన్ని ప్రతిబింబిస్తుందా? రాజభవనాలతో, బ్యూరోక్రాట్లచే ప్రధానమంత్రి ఎవరనేది నిర్ణయించబడుతుందని విమర్శించారు. ఇంకా ‘ఎంతకాలం రాజీపడతాం?’ ఎంపీలుగా ఎన్నికయ్యేందుకు బయటి శక్తుల సహాయం ఎంతకాలం కొనసాగిస్తాం? అని మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ ప్రశ్నించారు. 2018, 2024 ఎన్నికలలో ఎన్నికల రిగ్గింగ్‌ను తీవ్రంగా ఖండించారు. చట్టాలను స్వతంత్రంగా రూపొందించడానికి చట్టసభ సభ్యులు శక్తిహీనతను గుర్తించడంపై రెహమాన్ విచారం వ్యక్తం చేశారు.
Read Also: US: పాలస్తీనా నిరసనల ఎఫెక్ట్.. విద్యార్థులపై యూనివర్సిటీలు వేటు
ఇక, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) బహిరంగ సభలను నిర్వహించడానికి అనుమతించాలని మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ వాదించారు. మే 2, మే 9 తేదీలలో కరాచీ, పెషావర్‌లలో ‘మిలియన్ మార్చ్’ కోసం PTI ప్రణాళికలు ప్రకటించింది. ప్రదర్శనలను అడ్డుకోవడం ప్రతికూల పరిణామాలకు దారి తీస్తుందని మౌలానా అన్నారు. ‘జనాలను ఆపలేమని, అడ్డుకోవాలని ప్రయత్నించే వారు తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.