Site icon NTV Telugu

Israel-India: ఫస్ట్ టైం ఇజ్రాయెల్ను విమర్శించిన భారత్.. గాజాపై దాడి తప్పు అని వెల్లడి

India

India

గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న నిరంతర దాడులపై భారత్ తొలిసారిగా తీవ్ర విమర్శలు చేసింది. సోమవారం రష్యాలో జరిగిన సమావేశం తర్వాత బ్రిక్స్ దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పాలస్తీనాలో అధ్వాన్నమైన పరిస్థితి, ముఖ్యంగా గాజా స్ట్రిప్‌లో కొనసాగుతున్న హింసపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇక, విదేశాంగ మంత్రులు UNGA తీర్మానాలు, UNSC రిజల్యూషన్ 2720ని సమర్థవంతంగా అమలు చేయాలని బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రులు టీమ్ తెలిపింది. అలాగే, గాజా స్ట్రిప్‌లోని పాలస్తీనియన్ పౌరులకు మానవతా సహాయాన్ని తక్షణమే ప్రారంభించి, అడ్డంకులు లేకుండా అందించాలని భారత్ పిలుపునిచ్చారు.

Read Also: Sudheer Babu-Mahesh Babu: మహేష్ బాబుకి సుధీర్ బాబు ఫోన్.. ఏం మాట్లాడుకున్నారంటే?

ఇక, హమాస్ చర్యలను కూడా బ్రిక్స్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. బందీలు, పౌరులందరినీ తక్షణమే విడుదల చేయాలని భారత్ తన ప్రకటనలో పేర్కొంది. బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రులు కూడా రఫాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. రాఫాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలపై విమర్శలు గుప్పించింది. పాలస్తీనా ప్రజలను వారి దేశం నుంచి బలవంతంగా తరలించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆరోపణు చేశారు. కాగా, బ్రిక్స్ దేశాలలో ప్రధానంగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాలు ఉన్నాయి. ఇక, రష్యా ప్రస్తుతం బ్రిక్స్‌కు అధ్యక్షత వహిస్తోంది.

Exit mobile version