Indians in Canada: కెనడా వెళ్లే భారతీయ విద్యార్థులకు కేంద్రం హెచ్చరిక.. ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indians in Canada: కెనడాలోని భారతీయ పౌరులను, ఆ దేశానికి వెళ్లే విద్యార్థులను జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. కెనడాలో ఇటీవల భారతీయుల పట్ల నేరాలు పెరిగాయని.. విద్వేష దాడి ఘటనలు కూడా ఎక్కువయ్యాయని.. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ద్వేషపూరిత నేరాలు, మతపరమైన హింస, భారత వ్యతిరేక కార్యకలాపాల గురించి కెనడాతో చర్చ చేపట్టామని, నేరాలపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. “కెనడాలో ఈ నేరాలకు పాల్పడినవారు ఇప్పటివరకు న్యాయస్థానం ముందుకు తీసుకురాబడలేదు” అని మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది. ఈ నేపథ్యంలో ఉన్నత విద్య, ఉద్యోగం కోసం కెనడా వెళ్లే భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఒట్టావోలో ఉన్న ఇండియన్ మిషన్ లేదా టొరంటో, వాంకోవర్‌లో ఉన్న కౌన్సులేట్లలో భారతీయ విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవాలని ప్రభుత్వం తన ప్రకటనలో కోరింది.
సిక్కులకు ప్రత్యేక దేశం కోరతూ ఖలిస్థాన్ అనుకూల శక్తులు కెనడాలో ప్రజాభిప్రాయ సేకరణ చేయడం దౌత్యపరంగా వివాదానికి దారీ తీసిన సమయంలోనే కేంద్రం ఈ సూచన చేయడం గమనార్హం.విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఈ ప్రజాభిప్రాయ సేకరణను ఉగ్రవాద, రాడికల్ శక్తుల హాస్యాస్పద చర్యగా అభివర్ణించారు. భారత్‌తో మంచి సంబంధాలున్న దేశం దీన్ని అనుమతించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
Digvijaya Singh: కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో నేను లేను..
కెనడాలో 1.6 మిలియన్ల మంది భారతీయ మూలాలు కలిగిన వారు, ప్రవాస భారతీయులు నివసిస్తున్నారు. వారు కెనడా జనాభాలో 3శాతం కంటే ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఇటీవలే భారతీయులే లక్ష్యంగా దుండగులు కాల్పులతో రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక సూచనలు చేసింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!