INDIA Bloc: ఇతర పక్షాలకు ఖర్గే పిలుపు.. ఇండియా కూటమిలో చేరాలని ఆహ్వానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తర్వాత రెండు కూటమిల మధ్య ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్డీఏ, ఇండియా కూటమిలు దెబ్బ దెబ్బగా సీట్లు సాధించాయి. బీజేపీ సొంతంగా ఎక్కువ సీట్లు సాధించకపోయినా.. మిత్ర పక్షాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. అయితే ఇండియా కూటమి కూడా ఆశించిన స్థాయిలో సీట్లు సంపాదించింది. దీంతో బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కూటమి నేతలంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. ఇతర పక్షాలకు ఆహ్వానం పలికారు. మోడీ నైతికంగా పరాజయం పాలయ్యారని పేర్కొన్నారు. ఇతర పక్షాలు.. ఇండియా కూటమిలో చేరాలని ఆహ్వానం పలికారు.
ఈ ఎన్నికల్లో ప్రజాభిప్రాయం ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఉందని ఖర్గే తెలిపారు. ఆయన నైతికంగా ఓడిపోయారన్నారు. అంతేకాకుండా వ్యక్తిగతంగా, రాజకీయంగానూ నష్టపోయారని విమర్శించారు. ఇండియా కూటమిలోకి ఇతర పార్టీలను ఆహ్వానిస్తున్నామన్నారు. భారత రాజ్యాంగ పీఠికపై విశ్వాసం, దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం వంటి లక్ష్యాలకు కట్టుబడి ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ ఇండియా కూటమిలోకి స్వాగతిస్తున్నట్లు ఖర్గే ప్రకటన చేశారు.
Also Read
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
- Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతోపాటు.. శరద్ పవార్ (ఎన్సీపీ-ఎస్పీ), ఎంకే స్టాలిన్ (డీఎంకే), సీతారాం ఏచూరి (సీపీఎం), అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ), కేసీ వేణుగోపాల్ (కాంగ్రెస్), సంజయ్ రౌట్ (శివసేన-ఉద్ధవ్‌ఠాక్రేవర్గం), సంజయ్ సింగ్ (ఆప్), ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), అభిషేక్ బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్), చంపయ్ సోరెన్ (జేఎంఎం), రాఘవ్ చద్దా (ఆప్), డి.రాజా (సీపీఐ), సుప్రియా సూలే, కల్పనా సోరెన్ సహా పలు పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు.
మరోవైపు ఎన్డీయే నేతలు ప్రధాని మోడీ నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి హాజరైన ఎన్డీయే పక్షాలు మోడీని కూటమిపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నెల 7న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. నరేంద్ర మోడీ ఈనెల 9న మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
#WATCH | INDIA bloc leaders hold a meeting at the residence of Congress president Mallikarjun Kharge in Delhi.
(Source: AICC) pic.twitter.com/1xtYlqQviE
— ANI (@ANI) June 5, 2024
తాజావార్తలు
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!