ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ చివరి లీగ్ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై భారత్ విక్టరీ సాధించింది. పాకిస్తాన్ను చిత్తుగా ఓడించింది. ఇప్పటికే వరుస విజయాలతో సెమీస్కు చేరిన భారత్.. నామమాత్రపు మ్యాచ్లో పాకిస్తాన్ ను ఓడించింది. 2-1 ఆధిక్యంతో గెలుపొందింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ రెండు గోల్స్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
PM Modi: “హిందువుల గురించి ప్రశ్నించిన జర్నలిస్టుపై దాడి”.. కాంగ్రెస్‌పై విరుచుకుపడిన ప్రధాని మోడీ..
ఈ టోర్నీలో భారత్ వరుసగా ఐదో విజయం సాధించింది. భారత్ 3-0తో చైనాపై, జపాన్‌పై 5-1తో, మలేషియాపై 8-1తో, కొరియాపై 3-1తో విజయం సాధించింది. చివరి 10 నిమిషాల్లో పాకిస్థాన్ జట్టు కేవలం 10 మంది ఆటగాళ్లతో మాత్రమే ఆడింది. పాకిస్తాన్ ఆటగాడు వహీద్ అష్రఫ్ రానాకు ఎల్లో కార్డ్ ఇవ్వడంతో 10 నిమిషాల పాటు అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌కు 5 పెనాల్టీ కార్నర్‌లు, పాకిస్థాన్‌కు 7 పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలుపొందగా.. పాకిస్థాన్ రెండు మ్యాచ్‌లు గెలిచింది. ఒకటి ఓడిపోయి, రెండు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.