Test Cricket: ప్రస్తుత క్రికెట్లో టీమిండియా అగ్రజట్టు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే, మూడు ఫార్మాట్లలో తిరుగులేని ప్రదర్శనలతో ఇటు స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా సిరీస్‌లు గెలిచి.. ప్రపంచ క్రికెట్లో మొదటి ప్లేసులో నిలుస్తుంది. అయితే టెస్టుల్లో కొంతమంది ప్లేయర్ల వల్ల టీమిండియా టాప్-3 లో కొనసాగుతుంది. వాళ్లలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ మరియు జడేజా లాంటి సీనియర్స్ వున్నారు. వీళ్లు ఎక్కడ ఆడినా.. సత్తా చాటుతుంటారు. దీంతో టెస్ట్ ఫార్మాట్‌లో భారత్ కొన్నేళ్లుగా అగ్ర స్థానాల్లో కొనసాగుతుంది. అయితే, 2025 సంవత్సరం క్రికెట్ అభిమానులకు ఒకరకంగా విషాదకరమైన సంవత్సరం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సంవత్సరంలోనే క్రికెట్‌కు చాలామంది దిగ్గజ క్రీడాకారులు గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు ఈ జాబితాలోకి ఛతేశ్వర్ పుజారా కూడా చేరాడు. తన వన్డే కెరీర్‌లో కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన పుజారా, టెస్ట్ క్రికెట్‌లో మాత్రం 103 మ్యాచ్‌లలో మొత్తం 7,195 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో పుజారా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.
Read Also: Sandalwood : టాలీవుడ్ ను చూసి ట్రాక్ తప్పుతున్న శాండిల్ వుడ్
కాగా, పుజారా రిటైర్మెంట్‌తో టీమిండియా టెస్ట్ క్రికెట్ ముగిసినట్లేనా అంటే అవుననే సమాధానాలు వినపడుతున్నాయి. ఎందుకంటే ఈ ఏడాది పుజారా కంటే ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్ రిటైర్ అయ్యారు. అయితే ఈ ముగ్గురు కూడా ఇప్పటికి టీమిండియా విజయాలలో కీలకంగా వున్నారు. అంతేకాదు, టెస్టుల్లో టీమిండియా ఇన్నివిజయాలు సాధించిందంటే ఈ ముగ్గురు పాత్ర కచ్చితంగా ఉంటుంది. ఈ సీనియర్ ఆటగాళ్లలో ఒక్క జడేజానే టెస్టుల్లో కొనసాగుతున్నాడు. అతడి అనుభవమేంటో మొన్న జరిగిన ఇంగ్లాండ్ సిరీస్‌లో కూడా చూసారు. కాగా ఇప్పుడు పుజారా కూడా తప్పుకోవడంతో, టెస్టుల్లో ఆ స్థాయిలో ఆడే ప్లేయర్లు దొరకడం కష్టమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడున్న యంగ్ ప్లేయర్లు ఒకట్రెండు సిరీసుల్లో అదరగొడుతున్నా… అన్ని ఫార్మా్ట్లలో వారు రాణిస్తారా? వారి ఆటతీరును సుదీర్ఘకాలం ప్రదర్శిస్తారా? లేదా? అనేది కూడా వేచిచూడాల్సిన విషయమే..
