భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. మొదటిది గ్వాలియర్, రెండో టీ 20 న్యూ ఢిల్లీ, మూడో టీ20 హైదరాబాద్‌లో జరుగనుంది. చాలా రోజుల తర్వాత.. ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ జరుగనుంది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో జరుగనున్న టీ20 మ్యాచ్ కోసం టిక్కెట్ల విక్రయం జరుగనుంది. రేపటి నుంచి భారత్-బంగ్లా టీ20 టిక్కెట్లు విక్రయం జరుపనున్నట్లు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు తెలిపారు.
Read Also: Apples: గ్రీన్ యాపిల్, రెడ్ యాపిల్ ఈ రెండింట్లో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా..?
ఉప్పల్ వేదికగా ఈనెల 12న భారత్ – బంగ్లాదేశ్ 3వ టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లు రేపు మద్యాహ్నం 12:30 నిమిషాల నుంచి పేటీఎం, ఇన్ సైడర్ వెబ్ సైట్ /యాప్‌లో విక్రయించనున్నారు. టిక్కెట్ల ప్రారంభ ధర రూ.750, గరిష్ఠ ధర రూ.15 వేలు ఉంది. ఈనెల 8 నుంచి 12 తేదీ వరకు, జింఖానా స్టేడియంలో ఆన్ లైన్‌లో బుక్ చేసిన టిక్కెట్లను రిడంషన్ చేసుకోవాలి. Redemption Timings: 11AM to 7PM.. ప్రభుత్వ గుర్తింపు గల ఏదైనా ఐడీ కార్డు, ఆన్‌లైన్ బుకింగ్ ప్రింట్ చూపించి టిక్కెట్లు తీసుకోవచ్చు.. ఆఫ్ లైన్ కౌంటర్లలో టిక్కెట్లు విక్రయించడం లేదని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు తెలిపారు.
Read Also: DK Aruna: రాజకీయాల్లో ఉన్నప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి