Site icon NTV Telugu

Jai shankar: భారత్ ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరిస్తుంది.. విదేశాంగ మంత్రి పోస్ట్ వైరల్!

Jaishankar

Jaishankar

Jai shankar: భారత్–పాకిస్తాన్ మధ్య గత కొన్ని రోజులుగా కొనసాగిన ఉద్రిక్తతల తరువాత, ఈరోజు భారత్ పూర్తి, తక్షణ కాల్పుల విరమణ ప్రకటించింది. అయితే, ఈ ప్రకటన అనంతరం దేశ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి సోషల్ మీడియా వేదికగా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. జైశంకర్ తన ట్వీట్‌లో.. “భారత్ ఉగ్రవాదం ఏ రూపంలో వచ్చినా నిర్దాక్షిణ్యంగా వ్యతిరేకిస్తుంది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఈరోజు ఒక అవగాహనకు వచ్చాయి. రెండు దేశాలూ ఇకపై కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ చర్య భూమి, వాయు, సముద్ర మార్గాలన్నింటికి వర్తించనుంది. ఇది ఒక శాంతియుత చర్యగా భావించవచ్చు. అయితే, ఉగ్రవాదంపై భారత్ వైఖరి మాత్రం స్పష్టమైనదిగా ఉంది. ఉగ్రవాదం ఏ రూపంలో వచ్చినా, దాని వ్యక్తీకరణ ఏ విధంగా ఉన్నా భారతదేశం దానికి సమాధానం ఇస్తుందని” పేర్కొన్నారు.

Read Also: India- Pakistan: పాకిస్థాన్ ఎన్నిసార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి ఉల్లంఘించిందో తెలుసా?

ఈ పరిణామాల నేపథ్యంలో, శాంతి దిశగా అడుగులు పడుతున్నప్పటికీ, జాతీయ భద్రత విషయంలో భారత్ ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని స్పష్టమవుతోంది. ఇక విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. భారతదేశం, పాకిస్తాన్ మధ్య మిలిటరీ ఆపరేషన్ల డైరెక్టర్లు మధ్య మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగిన కాల్‌లో, భూమి, వాయు, సముద్ర మార్గాల్లో జరిగిన అన్ని మిలిటరీ చర్యలను తక్షణంగా ఆపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి అమలులోకి వస్తుందని అన్నారు. ఈ కాల్పుల విరమణ ప్రకటనకు ముందు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ద్వారా ఈ వార్తను ముందుగా ప్రకటించారు. ఆయన ప్రకటనలో అమెరికా మధ్యవర్తిత్వంతో ఈ విరమణ ఒప్పందం సాధ్యమైందని పేర్కొన్నారు.

Exit mobile version