NTV Telugu Site icon

Vijaysai Reddy: ఏ కూటమిలో చేరే ఆలోచన మాకు లేదు.. మాది న్యూట్రల్ స్టాండ్!

Vijaysai Reddy

Vijaysai Reddy

ఏ కూటమిలో చేరే ఆలోచన తమకు లేదని, తమది న్యూట్రల్ స్టాండ్ అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఇండియా కూటమి, ఎన్డీఏలకు తాము సమాన దూరం అని పేర్కొన్నారు. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ మీద పార్టీ అధ్యక్షుడు ఆలోచనలకు అనుగుణంగా జీపీసీ ఎదుట తమ అభిప్రాయం చెబుతాంని చెప్పారు. ప్రాంతీయ పార్టీగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యం అని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చెప్పిన మాట ఎప్పుడు చెయ్యలేదని, బాబు చేతుల్లో జనం నాలుగోసారి మోసపోయారని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శించారు.

‘ఇండియా కూటమి, ఎన్డీఏ.. రెండింటికీ మేం సమాన దూరం. ఏ కూటమిలో చేరే ఆలోచన మాకు లేదు, మాది న్యూట్రల్ స్టాండ్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద పార్టీ అధ్యక్షుడు ఆలోచనలకు అనుగుణంగా జీపీసీ ఎదుట మా అభిప్రాయం చెబుతాం. ప్రాథమిక దశలో మేం వ్యతిరేకించలేదు. ప్రాంతీయ పార్టీగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా చేసే ఆందోళనలతో సమిష్టిగా పోరాటం చెయ్యాలి. సామాన్యులపై విద్యుత్ భారం తగ్గించే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం’ అని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.

‘సీఎం నారా చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చెప్పిన మాట ఎప్పుడు చెయ్యలేదు. చంద్రబాబు చేతుల్లో జనం నాలుగోసారి మోసపోయారు. నాణ్యమైన విద్య, వైద్యం ఇస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి.. నాణ్యమైన మద్యం అమ్మకాలకు మాత్రమే పరిమితం అయ్యింది. మా హయాంలో మెరుగైన విద్య, వైద్యంను అందించాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. విద్యుత్ భారం తగ్గించే వరకు పోరాటం చేస్తాం’ అని గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు.