Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి మహాసభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజాలు హాజరుకానున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ తెలిపారు. గురువారం విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాణిక్కం ఠాగూర్ మాట్లాడుతూ .. రాష్ట్రంలో జరిగే అవినీతి, అక్రమాలు, ల్యాండ్, శ్యాండ్, భూకబ్జాలు గత అయిదేళ్ల కాలంలో ప్రధాని నరేంద్ర మోడీకి కనిపించలేదని విమర్శించారు. బిజెపితో అంటకాగుతున్న వైసీపీకి మోడీ కొమ్ముకాసారని, ఇప్పుడు అవినీతని గగ్గోలు పెడుతుడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మే నెల 11వ తేదీ (శనివారం) కడప సభకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతున్నారని మాణిక్యం ఠాగూర్ వెల్లడించారు.
Read Also: Election Campaign: ప్రచారానికి ఇంకా 2 రోజులే.. దూకుడు పెంచిన పార్టీలు
