Site icon NTV Telugu

IND vs AFG: భారత్ – అఫ్గానిస్థాన్ రెండో టీ20 మ్యాచ్.. ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

Ind Vs Afg

Ind Vs Afg

భారత్-అఫ్గానిస్థాన్ మధ్య నేడు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోండగా.. సిరీస్ సమం చేయాలనే ఉద్దేశంతో అఫ్గానిస్థాన్ జట్టు రంగంలోకి దిగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఎంట్రీ ఇస్తున్నాడు. మరోవైపు.. యశస్వి జైస్వాల్ కంటే.. శుభ్‌మన్ గిల్‌ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు స్పిన్ బౌలర్లలో రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్‌లలో ఎవరిని ఎంపిక చేయడం జట్టు మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇదిలా ఉంటే.. తొలి టీ20 మ్యాచ్ లో ఆడని రషీద్ ఖాన్.. ఈ మ్యాచ్‌లో కూడా ఆడటం లేదు. రషీద్ ఖాన్ ఆడకపోవడం.. జట్టుకు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు.

Read Also: Delhi: ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు.. ఆలస్యంగా నడిచిన విమానాలు, రైళ్లు..

టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్..!:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్/కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్.

ఆఫ్ఘనిస్తాన్ ప్లేయింగ్ ఎలెవన్..!:
రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మత్ షా, అజ్మతుల్లా ఉమర్జాయ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, కరీం జనత్, ఫజల్హాక్ ఫరూఖీ, నవీన్-ఉల్-హక్, ముజీబ్ ఉర్ రెహ్మాన్.

Read Also: Ram Mandir: రామ మందిర వేడుకల్లో ముస్లింలు పాల్గొనకూడదు.. కేంద్రం “నాన్ సెక్యులర్” అంటూ ముస్లిం ప్యానెల్ ఆగ్రహం..

Exit mobile version