Ind Vs Pak: కాటేరమ్మ కొడుకు దూకుడు.. పాకిస్థాన్‌పై హాఫ్ సెంచరీ పూర్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో భాగంగా దోహాలోని వేదికగా జరిగిన ఇండియా-ఎ, పాకిస్థాన్-ఎ మధ్య ఎనిమిదో మ్యాచ్ ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగింది. టాస్ గెలిచిన పాకిస్థాన్-ఎ కెప్టెన్ అబ్దుల్ సమద్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఓపెనర్లు షమీల్ హుస్సేన్, మాజ్ సదాకత్ దూకుడుగా ఆడుతూ తొలి వికెట్‌కు 66 పరుగులు జోడించారు. షమీల్ (33)ను ఆయుష్ బదోని అవుట్ చేయగా, ఆ తర్వాత మాజ్ సదాకత్ (59) అర్ధశతకం పూర్తి చేసుకుని 19వ ఓవర్లో పెవిలియన్ చేరారు.
మధ్య ఓవర్లలో హసన్ నవాజ్ 82 బంతుల్లో 79 పరుగులతో మెరవగా, చివర్లో ఫర్హాన్ యూసుఫ్ 48 బంతుల్లో 56 పరుగులతో వేగంగా ఆడి జట్టు స్కోరు 300 దాటించారు. అయితే వరుస వికెట్లు పడటంతో పాకిస్థాన్-ఎ 49.2 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, విప్రజ్ నిగమ్, ప్రిన్స్ యాదవ్, సూర్యాంశ్ షెడ్గే తలా రెండు వికెట్లు పడగొట్టారు.
Also Read
314 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా-ఎకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఐదు ఓవర్లలోపే వైభవ్ సూర్యవంశీ (11), ఆయుష్ బదోని (0) వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడైన షాట్లతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. 8వ ఓవర్లో మొహమ్మద్ ఇమ్రాన్ రంధావా బౌలింగ్‌లో వరుస బౌండరీలు, సిక్సర్లతో జట్టు స్కోరును 50 దాటించారు.
ఫీల్డింగ్‌లో తలకు, ఆపై బ్యాటింగ్ సమయంలో 11వ ఓవర్లో మోచేతికి గాయమైనప్పటికీ కెప్టెన్ తిలక్ వర్మ క్రీజులో నిలదొక్కుకున్నారు. సిక్సర్‌తో అర్ధశతకం పూర్తి చేసిన అభిషేక్ శర్మ ధాటిగా ఆడుతుండగా, 14.2 ఓవర్లలో ఇండియా-ఎ 82/2 వద్ద నిలిచింది. విజయానికి ఇంకా 232 పరుగులు అవసరం కాగా, సెమీఫైనల్ రేసులో నిలవడానికి ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-9 Live : నేడు మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కల్యాణం.. తొమ్మిదో రోజు వేడుకలివే..!
-
Ind Vs Pak: కాటేరమ్మ కొడుకు దూకుడు.. పాకిస్థాన్‌పై హాఫ్ సెంచరీ పూర్తి..
-
CM Revanth Reddy : కోటి ఓట్లు.. 90 సీట్లు మా టార్గెట్..
-
Man Rescued: డ్రైనేజీలో చిక్కుకున్న వ్యక్తి.. నాలుగు రోజుల తర్వాత సురక్షితంగా బయటకు..
-
Pakistan minister: ఉగ్రవాదం, సింధు జలాలపై పాక్ మంత్రి దాటవేత!
-
Nitin Nabin: రాహుల్ గాంధీతో చర్చకు బీజేపీ మండలాధ్యక్షుడు చాలు..
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!