భారత కీర్తి పతాక మువ్వన్నెలు జెండా కడియం నర్సరీలో రెపరెపలాడాయి. గ్లోబల్ వార్మింగ్ ను అధిగమించేందుకు పచ్చదనాన్ని ప్రేమించాలని పిలుపునిస్తూ తూర్పుగోదావరి జిల్లా కడియం పల్ల వెంకన్న నర్సరీ యాజమాన్యం తీర్చిదిద్దిన ఈ ఆకృతి అధ్యంతం సందేశాత్మంగా నిలిచింది . పంద్రాగస్టు శుభాకాంక్షలు తెలుపుతూనే పచ్చదనం ప్రాధాన్యతను వివరించింది. .ప్రముఖ ల్యాండ్ స్కేపింగ్ డిజైనర్ ,పల్ల వెంకన్న నర్సరీ డైరెక్టర్ పల్ల వెంకటేష్ చేసిన మొక్కల కూర్పు సందర్శకుల మనసును దోస్తోంది.
Also Read : Vodafone Idea Q1 Results: తీరని వొడాఫోన్ ఐడియా కష్టాలు.. తొలి త్రైమాసికంలో రూ.7,840 కోట్ల నష్టం
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగంతో ఆంగ్లేయుల బానిసశృంఖలాల నుండి స్వేచ్ఛ భారత్ ను సాధించుకున్న మనం కాలుష్యం కోరల్లో చిక్కుకుపోతున్నామని ఆ మహమ్మారిని తరిమికొట్టాలంటే గ్రీన్ ఇండియా నినాదం ప్రతి ఒక్కరిలో ఉండాలని సందేశం ఇస్తూ ఈ ఆకృతి ఏర్పాటు చేశారు. ఉన్నత చదువులు చదువుకున్న యువత విదేశీ కొలువులకు పరిగెడుతుందని గ్రీన్ ఇండియా సందేశం తో ఆ యువతకు తిరిగి మనదేశానికి ఆహ్వానించాలనే ఆకాంక్షను వెంకటేష్ వ్యక్తం చేశారు. మనం సాధించుకున్న స్వాతoత్ర్యం లోనే భారత ఔన్నత్యం ఇమిడి ఉందని అటువంటి పంద్రాగస్టు వేడుకను మా నూతన నర్సరీలో మొక్కలతో ఆవిష్కరించడం ఆనందంగా ఉందని అంటున్నారు.
Also Read : Ben Stokes: బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఒత్తిడి కారణంగా..!