Ben Stokes set to take U-Turn on ODI Retirement to play in World Cup 2023: భారత గడ్డపై జరగనున్న మెగా ఈవెంట్ వన్డే ప్రపంచకప్ 2023కి ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. దాంతో అన్ని జట్లు ఇప్పటినుంచే కసరత్తులు మొదలెట్టాయి. జట్టు కూర్పుపై ప్రణాళికలు రచిస్తునాయి. అయితే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు గుడ్‌న్యూస్ అందే అవకాశం ఉంది. టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ తన వన్డే రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి మేరకు స్టోక్స్ వన్డేల్లో ఆడేందుకు సిద్దమైనట్లు ఓ ఇంగ్లీష్ దినపత్రిక తమ కథనంలో పేర్కొంది.
ఇంగ్లీష్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ గత సంవత్సరం జూలైలో ఫిట్‌నెస్ కారణంగా వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. అప్పటినుంచి టెస్ట్, టీ20లు మాత్రమే ఆడుతున్నాడు. అయితే వన్డే ప్రపంచకప్ 2023లో ఇంగ్లండ్‌కు స్టోక్స్ అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే.. గత ప్రపంచకప్ గెలవడంతో స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు. ఈబీసీ విజ్ఞప్తి మేరకు స్టోక్స్ తన రిటైర్మెంట్ విషయంలో యూ టర్న్ తీసుకోవడానికి సిద్దమయ్యాడట.
‘బెన్ స్టోక్స్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి సిద్దమయ్యాడు. ప్రపంచకప్ 2023లో ఇంగ్లండ్ తరపున అతడు మళ్లీ బరిలోకి దిగనున్నాడు. ఇందుకోసం వచ్చే ఐపీఎల్ 2024 సీజన్‌ను త్యాగం చేయనున్నాడు. ఇంగ్లండ్ బోర్డు, వన్డే కెప్టెన్ జోస్ బట్లర్‌తో సంప్రదింపులు తర్వాత స్టోక్స్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు’ అని ది టెలిగ్రాఫ్’ ఓ ఇంగ్లీష్ దినపత్రిక తమ కథనంలో పేర్కొంది.
వన్డే ప్రపంచకప్ 2023కు ప్రాథమిక జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నేడు ప్రకటించే అవకాశం ఉంది. మరి ఈ జట్టులో బెన్ స్టోక్స్ ఉంటాడో లేదో చూడాలి. మెగా టోర్నీలో ఇంగ్లండ్ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 5న న్యూజిలాండ్‌తో తలపడనుంది. ప్రపంచకప్ అక్టోబర్ 5న ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) 18 మంది ఆటగాళ్లతో కూడిన ప్రాథమిక జట్టు (ప్రిలిమినరీ స్క్వాడ్)ను ఇప్పటికే ప్రకటించింది.
Ben Stokes is ready to come out of retirement for the ODI World Cup. [The Telegraph] pic.twitter.com/k84PQce1Ji
— Johns. (@CricCrazyJohns) August 14, 2023