సొంతగడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు చెలరేగారు. ఇంతకుముందు వెస్టిండీస్ తో జరిగిన టీ20 సిరీస్ ను సొంతం చేసుకోగా.. తాజాగా వన్డే సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన రెండో వన్డేలో ఇండియా 115 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈవిజయంతో మూడు వన్డేల సిరీస్ ను 2-0తో సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా ఉమెన్స్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. యువ బ్యాటర్ హర్లీన్ డియోల్ సెంచరీతో అదరగొట్టింది. 103 బంతుల్లో 16 ఫోర్లతో 115 పరుగులు చేసింది. వన్డే క్రికెట్ లో హర్లీన్ కు మొదటి సెంచరీ.
Read Also: Minister Nadendla Manohar: ఫుడ్ కల్తీ అనేది సీరియస్ విషయంగా గుర్తించాం..
ప్రతీకా రావల్ (76), స్మృతి మంధాన (53), జెమీయా రోడ్రిగ్స్ (52) హాఫ్ సెంచరీలతో రాణించారు. రిచా ఘోష్ (13*), దీప్తి శర్మ (4*) పరుగులు చేశారు. వెస్టిండీస్ బౌలర్లలో డియాండ్ర డాటిన్, జైదా జేమ్స్, అఫీ ఫ్లెచర్, కియాన జోసెఫ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన వెస్టిండీస్ 46.2 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. హీలీ మాథ్యూస్ (106) సెంచరీతో ఒంటరి పోరాటం చేసింది. 109 బంతుల్లో 13 ఫోర్లతో 106 పరుగులు చేసింది. షమీన్ క్యాంప్‌బెల్ (38), కియానా జోసెఫ్ (15), నెరిస్సా క్రాఫ్టన్ (13), డియాండ్రా డాటిన్ (10), జాడా జేమ్స్ (25), అఫీ ఫ్లెచర్ (22) పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో ప్రియా మిశ్రా 3 వికెట్లు పడగొట్టింది. దీప్తి శర్మ 2, టిటాస్ సధు రెండు వికెట్లు తీశారు. రేణుకా సింగ్ ఒక వికెట్ సాధించింది. కాగా.. తొలి వన్డేలో భారత్ 211 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక చివరి వన్డే డిసెంబర్ 27న జరగనుంది.
Read Also: Ramtek bungalow: ‘‘రామ్‌టెక్ బంగ్లా’’ పేరు వింటేనే ‘మహా’ మంత్రులకు భయం.. కారణాలేంటి..?