Site icon NTV Telugu

IND W vs SL W: చివర్లో తడబడ్డ టీమిండియా.. విక్టరీ సాధించిన శ్రీలంక.!

Ind W Vs Sl W

Ind W Vs Sl W

IND W vs SL W: కోలంబోలోని ఆర్‌.పి‌.ఎస్ మైదానంలో నేడు జరిగిన శ్రీలంక మహిళల వన్డే ట్రై సిరీస్‌లో భారత్‌పై శ్రీలంక మహిళల జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 50 ఓవర్లలో 275 పరుగులు చేసింది. 276 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక జట్టు 49.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించి మ్యాచ్‌ను గెలుచుకుంది.

Read Also: Riyan Parag: వరుసగా ఆరు సిక్స్‌లు బాదిన రియాన్ పరాగ్.. వీడియో వైరల్!

ఇక భారత మహిళల జట్టు బ్యాటింగ్‌లో రిచా ఘోష్ (58 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు 58 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. ఆ తర్వాత జెమీమా రోడ్రిగ్స్ (37), ప్రతికా రావల్ (35), హర్మన్‌ప్రీత్ కౌర్ (30) రాణించడంతో మంచి స్కోరు నమోదు చేశారు. చివరి వరుసలో కాష్వీ గౌతమ్ (17), స్నేహ రాణా (10) పరుగులతో రాణించారు. దీనితో మొత్తం 50 ఓవర్లలో భారత జట్టు 9 వికెట్లు కోల్పోయి 275 పరుగులు చేసింది. ఇక శ్రీలంక బౌలింగ్‌లో చమారి అథపత్తు, సుగందికా కుమారి చెరో 3 వికెట్లు తీసి భారత్‌ను కట్టడి చేశారు. విహంగా, ఇనోకా రణవీర ఒక్కొక్క వికెట్ తీశారు.

Read Also: Murshidabad riots: బెంగాల్ ముర్షిదాబాద్ అల్లర్లపై గవర్నర్ సంచలన రిపోర్ట్.. ఉగ్రవాదంపై హెచ్చరిక..

ఇక లక్ష్య ఛేదనలో శ్రీలంక జట్టు ఓపెనర్లు ఆరంభాన్ని నెమ్మదిగా మొదలు పెట్టిన, మిడిల్ ఆర్డర్ లో హర్షితా సమరవిక్రమ (53), కవిషా దిల్హారి (35), కెప్టెన్ అథపత్తు (23) మంచి ఆటతీరు కనబరిచారు. కానీ, మ్యాచ్ లో నిలక్షికా సిల్వా కేవలం 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 56 పరుగులు చేసి టీమ్‌కు విజయాన్ని అందించింది. దీనితో ఆమెకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు’ లభించింది. చివర్లో అనుష్కా సంజీవని (23 నాటౌట్), సుగందికా కుమారి (19 నాటౌట్) గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇక భారత బౌలింగ్ పరంగా చూస్తే.. స్నేహ రాణా 3 కీలక వికెట్లు తీసింది. అలాగే ప్రతికా రావల్, శ్రీ చరణి ఒక్కొక్క వికెట్ తీశారు. ఈ విజయంతో శ్రీలంక మహిళల జట్టు ట్రై సిరీస్‌లో కీలకమైన మ్యాచ్‌లో విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో ముందంజ వేసింది.

Exit mobile version