Site icon NTV Telugu

Abhishek Sharma Record: విరాట్ కోహ్లీ తర్వాత.. అభిషేక్ శర్మ చెత్త రికార్డ్!

Abhishek Sharma

Abhishek Sharma

Abhishek Sharma Unwanted Record in T20Is: టీమిండియా యువ బ్యాటర్ అభిషేక్ శర్మ ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ చేసిన తర్వాత డిమోట్ అయిన రెండో భారత బ్యాటర్‌గా అభిషేక్ అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా జింబాబ్వే‌తో జరిగిన రెండో టీ20లో ఓపెనర్‌గా బరిలోకి దిగి సెంచరీ చేసిన అభిషేక్.. మూడో టీ20లో డిమోట్ అయి మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. రెగ్యులర్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తుది జట్టులోకి రావడంతో అభిషేక్ ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ తీవ్రంగా నిరాశపరిచాడు. 9 బంతులాడి 10 పరుగులే చేశాడు.

Also Read: IND vs ZIM: అంతర్జాతీయ టీ20ల్లో చరిత్ర సృష్టించిన భారత్‌!

గతంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. ఆసియా కప్ 2022లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగి సెంచరీ చేసిన కోహ్లీ.. తర్వాతి మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. ఆ మ్యాచ్‌లో విరాట్ 2 పరుగులే చేశాడు. ఇప్పుడు అభిషేక్ శర్మ కూడా కోహ్లీనే ఫాలో అయ్యాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో అభిషేక్‌ను డిమోట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై ఫాన్స్ మండిపడుతున్నారు. సెల్ఫిష్ కెప్టెన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version