NTV Telugu Site icon

Virat Kohli Out: ఉనాద్కత్‌ బౌలింగ్‌లో కోహ్లీ ఔట్.. వీడియో వైరల్‌!

Virat Kohli Out Test

Virat Kohli Out Test

Virat Kohli dismissed by Jaydev Unadkat in practice match: భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. గ్రూపులుగా విండీస్ చేరిన టీమిండియా ప్లేయర్స్ సన్నాహాలు మొదలెట్టారు. మంగళవారం వరకు నెట్స్‌కు పరిమితమైన ప్లేయర్స్.. బుధవారం నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టు.. రెండు టీంలుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. బ్యాటర్లంతా ఒక టీంలో.. బౌలర్లంతా ఇంకో టీంలో ఉండి ప్రాక్టీస్ చేశారు.

బుధవారం ప్రారంభమైన ప్రాక్టీస్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఈ ఇద్దరు బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ పరుగులు చేశారు. ఇద్దరూ తొలి సెషన్ మొత్తం ఆడి హాఫ్ సెంచరీలు చేశారు. అయితే మిగతా వారికీ బ్యాటింగ్ అవకాశం ఇవ్వడం కోసం రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు. వీరి అనంతరం విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ మైదానంలోకి వచ్చారు. గిల్ బాగా ఆడినా.. స్టార్ బ్యాటర్ కోహ్లీ మాత్రం విఫలమయ్యాడు. తన ఆఫ్ సైడ్ బలహితనను మరోసారి బయటపెట్టాడు. లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనాద్కత్‌ బంతిని ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్‌గా సందించగా.. స్లిప్ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో వైరల్‌గా మారింది.

విరాట్ కోహ్లీ అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన అజింక్య రహానే ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. జయదేవ్ ఉనాద్కత్ బౌలింగ్‌లోనే ఔట్ అయ్యాడు. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా.. పేసర్లు మొహ్మద్ సిరాజ్, ఉనాద్కత్‌లు భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ఇక జులై 12 నుంచి వెస్టిండీస్‌, భారత్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్ ఓపెనర్లుగా.. శుభ్‌మన్ గిల్ ఫస్ట్ డౌన్‌లో దిగే అవకాశాలు ఉన్నాయి. ఆపై కోహ్లీ, రహానే బ్యాటింగ్ చేయనున్నారు.

Also Read: Oppo Reno 10 5G Price: లీకైన ఒప్పో రెనో 10 5జీ ధర.. ఫీచర్స్ తెలిస్తే షాక్ అవుతారు!

Also Read: MS Dhoni Birthday: కటౌట్ చూడు డూడ్.. ఎంఎస్ ధోనీపై తెలుగు ఫాన్స్ అభిమానం మాములుగా లేదు!