Shubman Gill, Ishan Kishan, Axar Patel and Mukesh Kumar Gets a Place in All Three Formats: వెస్టిండీస్ పర్యటనకు ఇప్పటికే టెస్ట్, వన్డేలకు జట్లను ప్రకటించిన బీసీసీఐ.. తాజాగా టీ20లకు కూడా ఎంపిక చేసింది. బీసీసీఐ కొత్త చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్టర్లు యువ జట్టుని ఎంపిక చేశారు. దాంతో మూడు సిరీస్‌ల కోసం జట్ల ఎంపిక పూర్తయింది. బీసీసీఐ సెలెక్టర్లు మూడు వేర్వేరు జట్లను ప్రకటించారు. వెస్టిండీస్ పర్యటనలోని మూడు ఫార్మాట్‌లలో నలుగురు ప్లేయర్స్ చోటు దక్కించుకున్నారు. టీమిండియా భవిష్యత్ కోసం ఆటగాళ్లను సిద్దం చేస్తున్నామని బీసీసీఐ సెలెక్టర్లు సంకేతాలిచ్చారు. ఆ నలుగుగు ఆటగాళ్లు ఎవరో కాదు.. శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్ మరియు ముకేశ్ కుమార్.
శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్ వెస్టిండీస్ పర్యటనలోని టెస్ట్, వన్డే, టీ20 జట్లకు ఎంపికయ్యారు. బీసీసీఐ సెలెక్టర్లు వీరికి ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి చూస్తే.. భవిష్యత్తులో భారత జట్టులోని మూడు ఫార్మాట్ల తుది జట్టలో వీరు ఉండటం ఖాయం అని తెలుస్తోంది. సూపర్ ఫామ్ కారకంగా గిల్ తుది జట్టులో ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. రెగ్యులర్ కీపర్ లేనందున ఇషాన్ కూడా జట్టులో ఉంటాడు. సంజూ శాంసన్ తుది జట్టులో ఉన్నా.. బ్యాటర్‌గా అయినా ఇషాన్ కొనసాగుతాడు.
టెస్ట్‌ల్లో రవీంద్ర జడేజాకు చోటు ఖాయం అయినా.. వన్డే, టీ20ల్లో మాత్రం అక్షర్ పటేల్ ఆడతాడు. అయితే ప్రపంచకప్ 2023 సమయానికి జడేజానే జట్టులో ఉండే అవకాశం ఉంది. మొహ్మద్ షమీ గైర్హాజరీలో ముకేశ్ కుమార్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. తుది జట్టులో కూడా ఉండనున్నాడు. మహ్మద్ సిరాజ్ నేతృత్వంలో ఆడనున్నాడు. ఇక నలుగురు విండీస్ పర్యటనలో రాణిస్తే.. వరల్డ్‌కప్ బెర్త్ దక్కే అవకాశం ఉంది. అలానే సీనియర్ల కెరీర్ చివరి దశలో ఉన్న నేపథ్యంలో రెగ్యులర్ ఆటగాళ్లుగా కూడా కొనసాగే అవకాశం ఉంది.
Also Read: Salaar Teaser: ‘సలార్’ టీజర్‌ను కేజీఎఫ్-2తో పోల్చుతున్న ఫాన్స్.. బాలేదంటూ..!
టెస్టు జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.
వన్డే జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, చహల్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్.
టీ20 జట్టు:
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
Also Read: IND vs WI: ఇకపై టీ20ల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను చూడలేమా?