NTV Telugu Site icon

Rohit Sharma Captaincy: రోహిత్ శర్మ కెప్టెన్సీ నిరాశపర్చింది.. భారత క్రికెట్ దిగ్గజం అసంతృప్తి!

Rohit Sharma Captaincy

Rohit Sharma Captaincy

Sunil Gavaskar Said I expected more from Rohit Sharma Captaincy: విరాట్ కోహ్లీ అనంతరం భారత జట్టు బాధ్యతలను రోహిత్‌ శర్మ తీసుకున్న విషయం తెలిసిందే. రోహిత్ కెప్టెన్సీలో భారత్ ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అదరగొడుతున్నా.. ఐసీసీ టోర్నీలో మాత్రం విఫలమవుతోంది. టీ20 ప్రపంచకప్‌ 2022లో భారత్ సెమీ ఫైనల్‌ నుంచే నిష్క్రమించిన భారత్.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2023లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో రోహిత్‌ కెప్టెన్సీపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. రోహిత్‌ కెప్టెన్సీ పట్ల తాను సంతృప్తి చెందలేదని, కెప్టెన్‌గా అతని ప్రదర్శనను ఎక్కువ ఆశించానని సన్నీ పేర్కొన్నాడు.

తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఐడియా ఎక్స్‌ఛేంజ్‌లో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ… ‘నేను రోహిత్ శర్మ నుంచి చాలా ఎక్కువగా ఆశించా. భారత్‌లో గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. విదేశాల్లో గెలుపొందినప్పుడే మన సత్తా ఏంటో తెలుస్తుంది. విదేశాలలో సవాల్ ఎదురవుతుంది. విదేశీ గడ్డలపై రోహిత్ శర్మ కెప్టెన్సీ నన్ను బాగా నిరాశపర్చింది. టీ20 ఫార్మాట్‌లోనూ కూడా నేను సంతృప్తిగ లేను. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా వందలాది మ్యాచ్‌ల అనుభవం,స్టార్‌ ఆటగాళ్లున్నా జట్టు ఫైనల్స్‌కు చేరుకోకపోవడం బాధ కలిగించింది’ అని అన్నాడు.

జట్టులో ఇది వరకు స్నేహితులు ఉండేవారు, ప్రస్తుతం సహచరులు మాత్రమే ఉన్నారని ఇటీవల సీనియర్ స్పిన్నర్ ఆర్ అశ్విన్‌ చేసిన వ్యాఖ్యలతో సునీల్ గవాస్కర్ ఏకీభవించాడు. ‘ఇది నిజంగా బాధకరమైన విషయం. మ్యాచ్‌ ముగియగానే జట్టు ఆటగాళ్లందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలి. ఆట గురించే కాకుండా.. మ్యూజిక్, సినిమాలు ఇలా మీకిష్టమైన వాటి గురించి చర్చించుకోవాలి. ప్రస్తుతం ప్రతి ఆటగాడికి ఒక్కో రూమ్‌ కేటాయిస్తున్నారు. గతంలో ఆటగాళ్లందరూ ఒకే గదిలో ఉండేవారు. ఆటగాళ్ల మధ్య గ్యాప్‌ పెరగడానికి ఇది ఒక కారణం’ అని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చారు.

Also Read: Samantha Instagram Story: మరో మూడు రోజులు మాత్రమే.. సమంత ఇన్‌స్టా స్టోరీ వైరల్!

Also Read: IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు అంటే భారత్‌కు భయం: అబ్దుల్ రజాక్