IND vs WI Test: ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి టీమిండియా..
- ఢిల్లీలో భారత్, వెస్టిండీస్ రెండో టెస్ట్ ప్రారంభం.
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్.
- జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగిన భారత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs WI Test: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్లో భాగంగా జరుగుతున్న భారత్, వెస్టిండీస్ రెండో టెస్ట్ మ్యాచ్ నేడు (అక్టోబర్ 10) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభమైంది. తొలి టెస్ట్‌ను ఘనంగా గెలిచిన శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా, ఈ మ్యాచ్‌లోనూ అదే ఉత్సాహంతో ఆడేందుకు సిద్ధమైంది. ఇక రెండో టెస్ట్ టాస్‌లో అదృష్టం టీమిండియాకే దక్కింది. గిల్ తన కెప్టెన్సీలో తొలి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక టాస్ గెలిచిన గిల్ వ్యాఖ్యానిస్తూ.. “వికెట్ బాగుంది, ఎక్కువ రన్స్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. మంచి ప్రదర్శన కొనసాగించాలి. కెప్టెన్సీ కొంచెం బాధ్యతను పెంచినా, దానిని నేను ఆస్వాదిస్తున్నాను అని అన్నాడు. ఇక మొదటి టెస్టు టీంలో ఆడిన జట్టే ఆడుతుందని, ఎలాంటి మార్పులు లేవని తెలిపాడు.
Crime: డయల్ 100కు ఫోన్.. సీఎంను గంటలో చంపుతానంటూ వార్నింగ్..!
Also Read
- CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
- CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
- Supreme Court: "ఇక బండి సీజ్".. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
మరోవైపు ఇక వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ చేస్ మాట్లాడుతూ.. మేము కూడా మొదట బ్యాటింగ్ చేయాలనుకున్నాం. పిచ్ పొడిగా ఉంది. మా బ్యాటింగ్‌పై సమావేశాల్లో చర్చించాం. కనీసం 90 ఓవర్లు బ్యాటింగ్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాము అని అన్నాడు. ప్రతి బంతిని విలువతో ఆడాలని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయని పేర్కొంటూ.. బ్రాండన్ కింగ్, అల్జారీ జోసెఫ్ బదులుగా టెవిన్ ఇమ్లాచ్, ఆండర్సన్ ఫిలిప్ జట్టులోకి వచ్చారని తెలిపాడు. ఇక నేటి ఇరు జట్లు ప్లేయింగ్ XI ఇలా ఉన్నాయి..
SS Thaman: కీబోర్డే కాదు.. గ్రౌండ్లో బౌలర్లను కూడా వాయించేసిన మ్యూజిక్ సెన్సేషన్
భారత్:
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
వెస్టిండీస్:
టాగెనరైన్ చాందర్‌పాల్, జాన్ క్యాంప్‌బెల్, అలిక్ ఆథనేజ్, షై హోప్, టెవిన్ ఇమ్లాచ్ (వికెట్ కీపర్), రోస్టన్ చేస్ (కెప్టెన్), జస్టిన్ గ్రీవ్స్, ఖారీ పియెర్, జోమెల్ వారికన్, ఆండర్సన్ ఫిలిప్, జేడెన్ సీల్స్.
తాజావార్తలు
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
-
CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!