NTV Telugu Site icon

Ishan Kishan vs KS Bharat: నేటి నుంచే వెస్టిండీస్‌తో తొలి టెస్టు.. భారత జట్టులో తెలుగబ్బాయికి చోటు కష్టమే?

Ishan Kishan Test

Ishan Kishan Test

Ishan Kishan, KS Bharat in Race for India Wicketkeeper in IND vs WI 1st Test: డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2023 ఓటమి తర్వాత భారత్ తొలి టెస్టు ఆడబోతోంది. వెస్టిండీస్‌తో నేటి నుంచి విండ్సర్‌ పార్క్‌ మైదానంలో తొలి టెస్టు మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్‌, డీడీ స్పోర్ట్స్‌ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. అలానే జియో సినిమా, ఫ్యాన్‌కోడ్ యాప్‌లలో కూడా మ్యాచ్ లైవ్ చూడొచ్చు. తొలి మ్యాచ్‌లో గెలిచి డబ్ల్యూటీసీ సైకిల్‌ 2023-25లో బోణీ కొట్టాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన ఫెవరేట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే టీమ్ కాంబినేషన్‌పైనే ప్రస్తుతం ఆసక్తి నెలకొంది.

తొలి టెస్టులో యశస్వి జైస్వాల్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగబోతున్నట్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వెల్లడించాడు. దాంతో శుభ్‌మన్‌ గిల్ ఓపెనింగ్‌ స్థానాన్ని వదులుకుని.. చేతేశ్వర్ పుజారా ఖాళీ చేసిన మూడో స్థానంలో ఆడబోతున్నాడు. ఇక నాలుగో స్థానంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఐదవ స్థానంలో వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఆడనున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో వికెట్‌ కీపర్‌ ఎవరనే సందేహం అందరిలో ఉంది. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్స్‌ రేసులో కేఎస్ భరత్, ఇషాన్ కిషన్ ఉన్నారు. వీరిలో ఒకరికి అవకాశం దక్కనుంది.

Also Read: Bank Scheme: రిస్క్ లేకుండా.. రూ.5 లక్షలు పొందే సూపర్ స్కీమ్..

ఇప్పటివరకు ఆడిన 5 టెస్టుల్లో ఆంధ్ర ఆటగాడు కేఎస్‌ భరత్‌ 8 ఇన్నింగ్స్‌ల్లో 129 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయకపోగా.. 18.43 సగటుతో మాత్రమే రన్స్ సాధించాడు. భరత్‌ వికెట్ల వెనుకాల మెరుగ్గానే రాణిస్తున్నా.. బ్యాటింగ్‌లో మాత్రం తడబడుతున్నాడు. గత ఐదు టెస్టుల్లో విఫలమైన భరత్‌కు ఈసారి చివరి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఈ టెస్టులో కూడా విఫలమైతే.. రెండో టెస్టు మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌కు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.

రిషబ్ పంత్ గాయం అనంతరం ఈ ఏడాది ఆరంభం నుంచి భారత్‌ తరపున కేఎస్‌ భరత్‌ కీపింగ్ చేస్తున్నాడు. దాంతో మెరుగ్గా రాణిస్తున్న ఇషాన్ కిషన్ బెంచ్‌పైనే ఉన్నాడు. భరత్, ఇషాన్ ఈసారి కూడా జట్టులో ఉన్నారు. ఇషాన్ ఇప్పటివరకు టీమిండియా తరపున టెస్టు క్రికెట్‌లో ఆడలేదు. అందుకే వెస్టిండీస్‌తో సిరీస్‌లో అరంగేట్రం చేసేందుకు ఎదురు చూస్తున్నాడు. ఇషాన్ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సమాచారం. దాంతో తొలి టెస్టు మ్యాచ్‌లో ఇషాన్‌కు అదృష్టం కలిసొస్తుందా లేక భరత్‌కు మరో అవకాశం వస్తుందా (Ishan Kishan vs KS Bharat) అనేది చూడాలి.

Also Raed: Nothing Phone 2 Launch: మార్కెట్‌లోకి నథింగ్ ఫోన్ 2.. ఫ్లాగ్‌షిప్‌ ప్రాసెసర్‌, పెద్ద బ్యాటరీ! ధర ఎంతంటే?