Site icon NTV Telugu

Virat Kohli-Chokli: ‘చోక్లీ’ అంటూ కామెంట్‌ చేసిన శ్రీలంక ఫ్యాన్.. విరాట్ కోహ్లీ రియాక్షన్ ఇదే!

Virat Kohli Chokli

Virat Kohli Chokli

Sri Lanka Fan Called Virat Kohli as Chokli: శ్రీలంకపై మూడు టీ20ల సిరీస్‌ను గెలిచిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌ కోసం సన్నద్ధమవుతొంది. టీ20లకు వీడ్కోలు పలికిన స్టార్‌ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు సోమవారం కొలొంబో చేరుకొని జట్టుతో కలిశారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో ఈ ఇద్దరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. శుక్రవారం జరిగే మొదటి వన్డే కోసం రోహిత్, కోహ్లీలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కొలంబోలో వర్షం కారణంగా బుధవారం భారత ప్రాక్టీస్ సెషన్ రద్దు చేయబడింది. విరాట్ కోహ్లీ మాత్రం ఓ గదిలో తన శిక్షణ కొనసాగించాడు. విరాట్ ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో ఓ శ్రీలంక అభిమాని ‘చోక్లీ.. చోక్లీ’ అంటూ గట్టిగా అరిచాడు. ఇది విన్న కోహ్లీ అతడి వైపు చూసి.. నిరాశ వ్యక్తం చేశాడు. శ్రీలంక అభిమాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారాయి. కోహ్లీని ‘చోక్లీ’గా పిలిచిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read: Anshuman Gaekwad Dies: టీమిండియా మాజీ క్రికెటర్ అన్షుమన్‌ గైక్వాడ్‌ కన్నుమూత!

ప్రధాన మ్యాచ్‌లలో సరైన ప్రదర్శన చేయని ఆటగాళ్లను చోకర్‌గా పిలుస్తుంటారు. విరాట్ కోహ్లీని చోక్లీగా పిలవడంతో శ్రీలంక అభిమానిపై సోషల్ మీడియాలో భారత ఫాన్స్ మండిపడుతున్నారు. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో విరాట్ హాఫ్ సెంచరీ చేశాడని గుర్తు చేస్తున్నారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి కేవలం ఏడు నెలల సమయం ఉన్నందున విరాట్ మరో ఐసీసీ ట్రోఫీని లక్ష్యంగా తన అత్యుత్తమ ప్రదర్శనను ప్రదర్శించాలని కోరుకుంటున్నారు. విరాట్ శ్రీలంకపై 53 వన్డేలు ఆడాడు. 63.26 సగటుతో 2594 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 12 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

Exit mobile version