NTV Telugu Site icon

IND vs SL: అతడి వల్లే మ్యాచ్‌లో ఓడాం: రోహిత్ శర్మ

Rohit Sharma Speech

Rohit Sharma Speech

Rohit Sharma Heap Praise on Jeffrey Vandersay: బ్యాటింగ్‌‌ వైఫల్యం కారణంగానే శ్రీలంకతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఓడిపోయాం అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. శ్రీలంక స్పిన్నర్ జెఫ్రె వండర్సే (6/33) అసాధారణ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడని, అతడే తమ పతనాన్ని శాసించాడని పేర్కొన్నాడు. మిడిలార్డర్ వైఫల్యంపై చర్చించాల్సిన అవసరం ఉందని రోహిత్ చెపుకొచ్చాడు. ఆదివారం కొలంబో వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో 32 పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన.. వాండర్సే (6/33) ధాటికి 42.2 ఓవర్లలో 208 పరుగులకే కుప్పకూలింది. మొదట లంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 240 పరుగులు చేసింది.

మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ… ‘మ్యాచ్ ఓడినప్పుడు ప్రతీది బాధిస్తుంది. జెఫ్రె వాండర్సే వేసిన 10 ఓవర్లు మాత్రమే కాదు, మ్యాచ్ మొత్తం నిరాశ కలిగిస్తుంది. నిలకడగా రాణించడం చాలా ముఖ్యం. ఈ రోజు జట్టుగా విఫలమయ్యాం. ఈ ఓటమి తీవ్ర నిరాశకు గురి చేసింది కానీ పరాజయాలు సహజమే. విజయం లేదా ఓటమిని స్వీకరించాలి. లెఫ్ట్, రైట్ కాంబినేషన్ ఉంటే స్ట్రైక్ రొటేట్ చేయడానికి సులువు అయ్యేది. 6 వికెట్లు తీసిన వాండర్సేదే ఈ గెలుపు క్రెడిట్’ అని అన్నాడు.

Also Read: Marriage Dates: శుభ ముహూర్తాలు మొదలు.. 17, 18 తేదీల్లో వేలాది వివాహాలు!

‘నేను బ్యాటింగ్ చేసిన విధానంతోనే 65 పరుగులు చేయగలిగాను. దూకుడుగా ఆడే క్రమంలో చాలా రిస్క్‌లు తీసుకుంటాను. కొన్నిసార్లు నిరాశ తప్పదు. రాజీ పడకూడదని నా ఉద్దేశం. ఈ పిచ్ స్వభావంను మేం అర్థం చేసుకున్నాం. ఇక్కడ మిడిల్ ఓవర్లలో ఆడటం చాలా కష్టం. తొలి పవర్ ప్లేలోనే వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలి. ఈ రోజు మేం విఫలమయ్యాం. ఈ వైఫల్యంపై పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మిడిలార్డర్ వైఫల్యంపై చర్చించాల్సిన అవసరం ఉంది’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.