NTV Telugu Site icon

IND vs SL: నేడు భారత్, శ్రీలంక ఢీ.. మ్యాచ్‌పై కన్నేసిన వరుణుడు! రద్దు మంచిదే

Rain Colombo

Rain Colombo

Rain Threat to IND vs SL Super Four Match in Asia Cup 2023: ఆసియా కప్ 2023 సూపర్-4లో భాగంగా సోమవారం ముగిసిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్.. మరో కీలక సమయానికి సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో నేడు రోహిత్ సేన తలపడనుంది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలోనే ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభం అవుతుంది. ఈ మ్యాచ్ లంక, టీమిండియాకు కీలకం కాబట్టి పటిష్ట జట్లతోనే బరిలోకి దిగనున్నాయి.

భారత్, శ్రీలంక మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని కొలంబో వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కొలంబోలో ఈ రోజు ఉదయం 60 శాతం వర్షం పడే అవకాశం ఉందట. ఆకాశం 98 శాతం మేఘావృతమై ఉండగా.. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం కురవనుందట. దాంతో మ్యాచ్‌ సజావుగా సాగే అవకాశాలు లేవు. లంబోలో ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా ఉందని సమాచారం. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునేందుకే మొగ్గు చూపొచ్చు. ప్రేమదాస స్టేడియంలో భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం ఉంది. ఇండో-పాక్ మ్యాచ్‌లో భారత్ 350కి పైగా స్కోర్ చేసింది. రెండో ఇన్నింగ్స్ సమయంలో పిచ్ అనుకూలంగా మారనుంది.

Also Read: Apple Event 2023: నేడే యాపిల్‌ ‘వండర్‌లస్ట్‌’ ఈవెంట్‌.. ఐఫోన్‌ 15 సిరీస్‌ లాంచ్‌! త్వరలోనే భారత్‌కు

ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే.. భారత్, శ్రీలంక ఖాతాలో చెరో పాయింట్ చేరుతుంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు కాబట్టి ఈరోజే ఫలితం తేలుతుంది. సూపర్-4లో ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచిన భారత్, శ్రీలంక జట్ల ఖాతాలలో రేండేసి పాయింట్స్ ఉన్నాయి. నేటి మ్యాచ్ రద్దయితే భారత్, శ్రీలంక ఖాతాలలో మూడేసి పాయింట్స్ ఉంటాయి. అప్పుడు ఫైనల్ రేసులో భారత్, శ్రీలంకతో పాటు పాకిస్తాన్ కూడా ఉంటాయి. ఒకవేళ భారత్ ఈ మ్యాచ్ గెలిస్తే ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అప్పుడు మరో బెర్త్ కోసం శ్రీలంక, పాకిస్తాన్ మధ్య పోటీ నెలకొంటుంది. నేటి మ్యాచ్ రద్దు అయినా రోహిత్ సేనకు కలిసొచ్చే అంశమే.

Show comments