Apple Event 2023: నేడే యాపిల్ ‘వండర్‌లస్ట్’ ఈవెంట్.. ఐఫోన్ 15 సిరీస్ లాంచ్! త్వరలోనే భారత్‌కు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iPhone 15 Launch Today in Apple Wanderlust Event: ప్రముఖ టెక్నాలజీ కంపెనీ యాపిల్ భారీ ఈవెంట్‌కు సిద్ధమైంది. ఈరోజు ‘వండర్‌లస్ట్’ పేరిట అమెరికాలో యాపిల్ కంపెనీ ఈవెంట్ నిర్వహించనుంది. ఐఫోన్ 15 సిరీస్‌తో పాటు యాపిల్ వాచ్, వాచ్ అల్ట్రా మోడల్స్ ఈ ఈవెంట్లో లాంచ్ కానున్నాయి. ఈ ఈవెంట్‌లో ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించిన అప్‌డేట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్‌లో ‘వండర్‌లస్ట్’ ఈవెంట్ నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు ఈవెంట్ ప్రారంభమవుతుంది. యాపిల్ యూట్యూబ్ ఛానెల్, యాపిల్.కామ్ వెబ్‌సైట్, యాపిల్ టీవీ ప్లస్, యాపిల్ డెవలపర్ యాప్స్‌లో ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది.
వండర్‌లస్ట్ ఈవెంట్‌లో ఐఫోన్ 15 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను యాపిల్ కంపెనీ లాంచ్ చేయనుంది. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, మరియు ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్స్ రిలీజ్ కానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్స్ త్వరలోనే భారత మార్కెట్లో అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. గతంలో మాదిరి కాకుండా 15 సిరీస్ 2-3 వారాల్లో అందుబాటులోకి రానుందట. 15 సిరీస్‌లో లైటనింగ్ పోర్ట్ బదులు.. యూఎస్‌బీ టైప్-సి పోర్టుతో రానుంది. ఫాస్ట్ ఛార్జింగ్, కర్వ్డ్ డిస్‌ప్లే లాంటి ఫీచర్స్ అదనంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read
Also Read: Asia Cup 2023: ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్స్ ఔట్!
ఐఫోన్ 15 సిరీస్‌తో పాటు యాపిల్ ఐఓఎస్ 17, ఐప్యాడ్ ఓఎస్ 17, మ్యాక్ ఓఎస్ 14, టీవీ ఓఎస్ 17, వాచ్ ఓఎస్ 10, మ్యాక్ ఓఎస్ సోనోమా వంటి ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించి అప్‌డేట్స్ గురించి వండర్‌లస్ట్ ఈవెంట్‌లో ప్రకటన చేసే అవకాశం ఉంది. యాపిల్ వాచ్ సిరీస్ 9, యాపిల్ వాచ్ సిరీస్ అల్ట్రా 9 కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఎయిర్ పాడ్స్ ప్రో యూఎస్‌బీ టైప్-సి పోర్టుతో రానుందని సమాచారం. మరికొద్ది గంటలు ఆగితే అన్ని వివరాలు తెలియరానున్నాయి. ఐఫోన్ 15 సిరీస్ ధర, ఫీచర్స్, డిస్‌ప్లే ఎలా ఉండబోతున్నాయో నేటి రాత్రి తెలిసిపోనుంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!