NTV Telugu Site icon

IND vs SL: యాక్షన్ మొదలెట్టిన గంభీర్‌.. రోహిత్‌కు ఫోన్! మరో ప్లేయర్‌పై వేటు

Gautam Gambhir Salary

Gautam Gambhir Salary

Gautam Gambhir does not want to make KL Rahul the India Captain: శ్రీలంక పర్యటనతో హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. కోచ్‌గా భారత జట్టుకు తన అత్యుత్తమ సేవలు అందించాలని గౌతీ భావిస్తున్నాడు. శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్‌లనే లక్ష్యంగా కాకుండా.. సుదీర్ఘ ప్రణాళికలు రచించాడట. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2023-25ను దృష్టిలో పెట్టుకుని జట్టు కూర్పును సిద్ధం చేస్తున్నాడట. ఈ నేపథ్యంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాడని తెలుస్తోంది.

రోహిత్ శర్మ టీ20లకు వీడ్కోలు పలకడంతో భారత జట్టు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా బాధ్యతలు చేపడతాడని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్ పేరు కెప్టెన్సీ రేసులోకి వచ్చింది. టీ20 ప్రపంచకప్ 2026 వరకు సూర్యనే కెప్టెన్‌గా కొనసాగుతాడని తెలుస్తోంది. సూర్యకు గౌతమ్ గంభీర్ మద్దుతుగా నిలిచాడట. దాంతో హార్దిక్ ఆశలు ఆవిరయ్యేలా ఉన్నాయి. గంభీర్ రాకతో మరో ప్లేయర్ ఆశలు ఆవిరయ్యేలా ఉన్నాయని తెలుస్తోంది.

Also Read: IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్‌.. కెప్టెన్ రోహిత్ శర్మనే!

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకోవడంతో.. శ్రీలంక పర్యటనలో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఉంటాడని అనుకున్నారు. అయితే రాహుల్‌ను కెప్టెన్ చేయడం గౌతమ్ గంభీర్‌కు ఇష్టం లేదని తెలుస్తోంది. అందుకే వన్డేలకు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని రోహిత్‌ను గంభీర్ కోరాడట. అమెరికా వెళ్లిన అతడిని స్వదేశానికి తిరిగిరావాలని కోరాడట. కొత్తగా బాధ్యతలు అందుకున్న వేళ పూర్తిస్థాయి జట్టు ఉండాలని గౌతీ కోరుకోవడం మరో కారణమని తెల్సుతుంది. ఐపీఎల్ సిరీస్ సందర్భంగా గౌతమ్ లక్నో జట్టుకు మెంటార్‌గా వ్యవహరించగా.. రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. వారిద్దరికీ మంచి అవగాహన ఉన్నా.. రాహుల్‌ను సారథ్యంకు అంగీకరించకపోవడం అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది. దీనిపై ఈరోజు క్లారిటీ రానుంది.