Suryakumar Yadav: టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav Equals Rohit Sharma’s Most Centuries Record in T20s: భారత్ తాత్కలిక కెప్టెన్, టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా నాలుగు సెంచరీలు బాదిన బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో మ్యాచ్‌లో సూర్య సెంచరీ బాది ఈ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ రికార్డును సమం చేశాడు.
టీ20 క్రికెట్లో ఇప్పటివరకు రోహిత్ శర్మ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ మాత్రమే అత్యధిక శతకాలు నమోదు చేశారు. ఈ ఇద్దరు నాలుగేసి శతకాలు బాదగా.. మూడో టీ20 మ్యాచ్‌లో సెంచరీ చేసిన సూర్యకుమార్ యాదవ్ వీరి సరసన చేరాడు. సూర్యకుమార్ 57 ఇన్నింగ్స్‌ల్లోనే నాలుగు సెంచరీలు చేయగా.. మ్యాక్స్‌వెల్ 92 ఇన్నింగ్స్‌ల్లో నాలుగు శతకాలు బాదాడు. రోహిత్ 140 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను అందుకున్నాడు. ఇక టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో సూర్య ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాడు. బాబర్ ఆజామ్ (3), కొలిన్ మున్రో (3) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
Also Read
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
Also Read: Cameron Green: అరుదైన వ్యాధితో బాధపడుతున్నా.. 12 ఏళ్లకు మించి బతకలేనన్నారు: కామెరూన్ గ్రీన్
టీ20ల్లో దక్షిణాఫ్రికా గడ్డపై సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా కూడా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ రికార్డుల్లో నిలిచాడు. దక్షిణాఫ్రికాపై ఇప్పటివరకు 6 ఇన్నింగ్స్‌లు ఆడిన సూర్య.. వరుసగా 50 నాటౌట్, 61, 8, 68, 56, 100 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలి 9 బంతుల్లో 18 పరుగులు చేసిన సూర్యకుమార్.. తర్వాతి 20 బంతుల్లో 17 రన్స్ మాత్రమే బాదాడు. ఇక చివరి 26 బంతుల్లో ఏకంగా 65 పరుగులు చేశాడు. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లో కూడా సూర్య చెలరేగిన విషయం తెలిసిందే.
#INDvSA #SuryakumarYadav 4th T20 Hundred 💯 🔥SKY pic.twitter.com/OryWMik3c6
— Apoorv Mishra (@ApurvamishraAAP) December 14, 2023
తాజావార్తలు
-
Pat Cummins: “ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది”.. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
-
Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
-
Shreyas Iyer-BCCI: బీసీసీఐ కీలక సమావేశంకు శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఫిక్స్!
-
Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..