IND vs SA: మార్‌క్రమ్ అద్భుతం.. కొన్నిసార్లు బౌలర్లపై ఎటాక్ చేయడమే సరైన నిర్ణయం: సచిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అంతేకాదు కేప్‌టౌన్‌లో తొలి టెస్టు విజయాన్ని భారత్ నమోదు చేసింది. భారత్ విజయంలో పేసర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించారు. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ 6 వికెట్లు తీయగా.. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా 6 వికెట్స్ పడగొట్టాడు. మొత్తంగా రెండో టెస్టులో సిరాజ్ 7 వికెట్లు, బుమ్రా 8 వికెట్లు తీశారు. దక్షిణాఫ్రికాపై సిరీస్‌ను సమం చేసిన భారత ఆటగాళ్లను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభినందించాడు.
‘దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌ను సమం చేసిన టీమిండియాకు శుభాకాంక్షలు. ఐడెన్ మార్‌క్రమ్ ఆడిన విధానం అద్భుతం. ఎందుకంటే కొన్నిసార్లు ఇలాంటి పిచ్‌పై డిఫెన్స్ ఆడడం కంటే.. బౌలర్లపై ఎటాక్ చేయడమే సరైన నిర్ణయం. మార్‌క్రమ్ అదే చేశాడు. జస్ప్రీత్ బుమ్రా అద్బుతంగా బౌలింగ్ చేశాడు. ఇటువంటి పిచ్‌పై ఎలా బౌలింగ్ చేయాలన్నది బుమ్రా చూపించాడు’ అని సచిన్ టెండూల్కర్ ఎక్స్‌లో పేర్కొన్నాడు. భారత జట్టు గెలుపుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
Also Read: ICC Awards 2023: ఐసీసీ వన్డే అవార్డు.. నలుగురిలో భారత్ నుంచి ముగ్గురు పోటీ!
దక్షిణాఫ్రికా పర్యటనను భారత్ ద్విగ్విజయంగా ముగించింది. మూడు (టీ20, వన్డే, టెస్ట్) సిరీసుల్లో ఒక్కదానిని కూడా కోల్పోకుండా స్వదేశానికి పయనం అయింది. వన్డే సిరీస్‌ను భారత్ గెలుచుకోగా.. టీ20 సిరీస్, టెస్టు సిరీస్‌లు సమం అయ్యాయి. కేప్‌టౌన్‌లో ఏడు టెస్టులు ఆడిన భారత్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!