Site icon NTV Telugu

IND vs SA: టీమిండియా ముందర భారీ టార్గెట్.. వైట్ వాష్ తప్పదా..?

India

India

IND vs SA: గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా జట్టు టీమిండియాకు భారీ టార్గెట్ ను ముందు ఉంచింది. భారత్ భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించినప్పటికీ విజయం దిశగా పయనం చాలా దూరంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించడంతో టీమిండియాకు వైట్‌వాష్ భయం వెంటాడుతోంది. దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోర్‌ను చేసింది. ఈ ఇన్నింగ్స్ లో ముత్తుస్వామి (109), జాన్సెన్ (93), స్టబ్‌స్స్ (49), బవుమా (41), వెర్రీన్ (45) బాట్స్‌మెన్స్ మంచి ఇన్నింగ్స్ ఆడారు. ఇక ఈ ఇన్నింగ్స్ లో భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా.. బుమ్రా, జడేజా చెరో రెండు వికెట్లు అందుకున్నారు.

Andhra King Thaluka: ఈసారి కింగ్ రామేనట.. సెన్సార్ రివ్యూ

ఇక ఈ భారీ స్కోర్ ఛేదనలో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 201 పరుగులకే ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్ లో యశస్వీ జైస్వాల్ (58) తప్ప మరెవరూ పెద్దగా రాణించలేదు. మార్కో జాన్సెన్ ఆరు వికెట్లు తీసి భారత బ్యాటింగ్‌ను నేలమట్టం చేయగా.. మరోవైపు హార్మర్ మూడు వికెట్లు తీసి టీమిండియా పతనానికి కారణమయ్యారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా వ్యూహాత్మకంగా బ్యాటింగ్ చేసింది. ఈ నేపథ్యంలో 260/5 వద్ద రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఇందులో ట్రిస్టన్ స్టబ్‌స్స్ (94), టోనీ డి జార్జీ (49), రికెల్‌టన్ (35) కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్స్ లో జడేజా నాలుగు వికెట్లు తీసి భారత్‌కు బ్రేక్‌త్రూ ఇచ్చినా.. స్కోర్ ఇప్పటికే భారత్‌కి అందని దూరంలోకి చేరింది. దీనితో భారత్‌కు 549 పరుగుల భారీ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా నిర్ధేశించింది. ప్రస్తుతం భారత్‌కు విజయావకాశాలు దాదాపుగా లేవని స్పష్టమవుతోంది. విజయానికి అవసరమైన పరుగులు భారీగా ఉండడంతో వైట్ వాష్ ప్రమాదం తప్పేలా లేదు. చూడాలిమరి రెండో ఇన్నింగ్స్ లో భారత్ ఎలా పోరాడుతుందో..? కనీసం మ్యాచ్‌ను డ్రా వైపు నడిపించగలదో అన్నది చూడాలి.

IND vs SA: లంచ్‌ బ్రేక్‌.. దక్షిణాఫ్రికా ఆధిక్యం 508 పరుగులు!

Exit mobile version