IND vs SA 2nd Test: గౌహతి బర్సాపారా క్రికెట్ స్టేడియంలో దక్షిణాఫ్రికా మరోసారి బ్యాటింగ్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. భారత బ్యాట్స్‌మెన్స్ మొత్తం ఇబ్బందులకు గురిచేసిన ఈ పిచ్‌పై దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్స్ ప్రశాంతంగా ఆడుతూ రెండో ఇన్నింగ్స్‌లో 260 పరుగులు చేసి తమ ఆధిక్యాన్ని 548 పరుగులకి చేర్చారు. దీనితో టీమిండియా ముందుకు భారీ లక్ష్యం వచ్చింది. టెస్ట్ చరిత్రలో స్వదేశంలో ఛేజ్ చేయాల్సిన అత్యధిక లక్ష్యం ఇదే కావడం విశేషం.
Vijayawada: ఉచిత దర్శనం భక్తులకు ప్రత్యేకంగా ‘అంతరాలయ దర్శనం’.. విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తి
ఇక నాల్గవ రోజు ప్రారంభంలో భారత్‌కు మంచి ప్రారంభం లభించింది. రవీంద్ర జడేజా రికెల్టన్, ఐడెన్ మార్క్రం వికెట్లు తీసినా.. అయితే వెంటనే మ్యాచ్ దక్షిణాఫ్రికా వైపు జారిపోయింది. వన్ డౌన్ లో వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ 94 పరుగులు చేయడంతో టీమిండియాకు భారీ లక్ష్యం వచ్చింది. అలాగే టోనీ డి జోర్జీ (49), వియాన్ ముల్డర్ (35*) కూడా కీలక పరుగులు జోడించారు. భారత బౌలర్లలో జడేజా నాలుగు వికెట్లు తీసి మెరిపించినప్పటికీ, మిగతా బౌలర్ల నుంచి పెద్దగా సహకారం లభించలేదు.
New Districts In AP: మూడు కొత్త జిల్లాలు, ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లకూ గ్రీన్ సిగ్నల్..!
ఇక 260/5 వద్ద సౌతాఫ్రికా డిక్లేర్ చేసిన తర్వాత.. రోజు ముగిసేంతవరకు భారత్ కేవలం నిలబడితే సరిపోయేది. కానీ మరోసారి భారత బ్యాటింగ్ ప్రభావం చూపించలేకపోయింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (13), కేఎల్ రాహుల్ (6) త్వరగా ఔట్ అవ్వడంతో భారత్ ఇబ్బందుల్లో పడింది. ఇక రోజు ముగిసే సరికి భారత్ 27/2 వద్ద ఉంది. సాయి సుధర్శన్‌తో పాటు నైట్‌హాక్ కుల్దీప్ యాదవ్ క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్స్ మార్కో జాన్సన్, సైమన్ హార్మర్ ఒక్కో వికెట్ తీశారు. దీనితో భారత్ ఐదో రోజు 522 పరుగులు చేజ్ చేయాల్సి ఉంది. ఈ లక్ష్యం సాధ్యం కాకపోతే, ఏడాది లోపలే భారత్ తమ స్వదేశంలో రెండోసారి టెస్ట్ సిరీస్ వైట్‌వాష్‌కు గురవుతుంది.
Stumps on Day 4⃣
See you tomorrow for Day 5️⃣ action.
Scorecard ▶️ https://t.co/Hu11cnrocG#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/MXqtMGMhay
— BCCI (@BCCI) November 25, 2025
