Site icon NTV Telugu

IND vs SA 2nd Test: భారీ ఒత్తిడిలో భారత్.. మార్పులు తప్పవా..?

Test

Test

IND vs SA 2nd Test: గువాహటిలో జరగనున్న రెండో టెస్టుకు ముందు టీమిండియా భారీ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో అనూహ్య ఓటమి చవిచూసిన భారత్‌కు ఈ మ్యాచ్ సిరీస్ భవితవ్యాన్ని నిర్ణయించేదిగా మారింది. తొలిసారిగా టెస్టుకు ఆతిథ్యం ఇస్తున్న బర్సాపారా స్టేడియంలోని పిచ్ స్వభావంపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఎర్రమట్టితో రూపొందించిన ఈ పిచ్ ప్రస్తుతం పచ్చికతో ఉన్నప్పటికీ, మ్యాచ్‌కు ముందునే దానిని కత్తిరించే అవకాశాలు లేకపోలేదు. సాధారణంగా ఎర్రమట్టి పిచ్‌లు ఆరంభంలో బౌన్స్ ఇస్తూ, తరువాత త్వరగా పొడిబారి పగుళ్లు వస్తాయి. మ్యాచ్ సాగేకొద్దీ స్పిన్నర్లకు ఎంతో అనుకూలంగా మారే అవకాశం ఉండటంతో, ఈ టెస్టు కూడా ఎక్కువ రోజులు నిలవకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. పిచ్ పాతబడిన తర్వాత అర్థంకాని బౌన్స్ వల్ల బ్యాటర్లను మరింత ఇబ్బందిపెట్టే అవకాశముంది. పచ్చికను పూర్తిగా తొలగిస్తే, గువాహటి పిచ్ కూడా ఈడెన్ గార్డెన్స్ తరహాలో మారి మళ్లీ స్పిన్ ఉచ్చు వేయే పరిస్థితులు ఏర్పడవచ్చు.

Ricky Ponting: గిల్ స్థానాన్ని భర్తీ చేసే సత్తా అతనికి ఉంది.. ఆసీస్ దిగ్గజం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

ఇక ఈ మ్యాచ్ శనివారం (నవంబర్ 22) ఉదయం 9 గంటలకు.. అంటే సాధారణ సమయం కంటే అరగంట ముందే ప్రారంభం కానుండటం మరో కీలక అంశం. ఉదయం తేమ అధికంగా ఉండటంతో కొత్త బంతితో పేసర్లకు సహకారం దొరకవచ్చు. పిచ్‌పై పచ్చికను అలాగే ఉంచితే బ్యాటింగ్‌కు అనుకూలమవుతుందని, తొలగిస్తే మాత్రం పిచ్ ప్రవర్తనే మారిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Smriti Mandhana: సరికొత్తగా గుడ్ న్యూస్ చెప్పిన వరల్డ్ కప్ విన్నర్.. వీడియో వైరల్..!

ఇదిలా ఉండగా, శుభ్‌మన్ గిల్ గైర్హాజరీతో జట్టులో చోటు కోసం సాయి సుదర్శన్, దేవ్దత్ పడిక్కల్ మధ్య పోటీ నెలకొంది. ఇందులో సుదర్శన్‌కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాషింగ్టన్ సుందర్ ఇటీవల మూడో స్థానంలో బాగా ఆడినందున.. సుదర్శన్ జట్టులోకి వస్తే ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. పిచ్‌పై పచ్చిక ఉంటే, భారత్ నలుగురు స్పిన్నర్ల వ్యూహం నుంచి బయటకు వచ్చి, అక్షర్ పటేల్ స్థానంలో పేస్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం ఇవ్వొచ్చు.

Exit mobile version