IND vs SA 1st Test: వన్డే ప్రపంచకప్- 2023 ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత విశ్రాంతి తీసుకున్న భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి మైదానంలో అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో టీమిండియాను హిట్‌మ్యాన్ ముందుండి నడిపించనున్నాడు. ఇక, రోహిత్‌తో పాటు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా సైతం ఈ సిరీస్‌లో భాగం కాబోతున్నారు. రేపటి నుంచి సెంచూరియన్ వేదికగా జరగబోతున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
Read Also: Criminal Bills: రాష్ట్రపతి ఆమోదంతో మూడు కొత్త క్రిమినల్ బిల్లులకు చట్టబద్ధత
అయితే, తొలి టెస్టుకు ముందు టీమిండియా సారథి రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. మొదటి టెస్టులో హిట్‌మ్యాన్ మరో 2 సిక్స్‌లు కొట్టినట్లైతే.. టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన రెండో భారతీయ ఆటగాడిగా రికార్డ్ సృష్టిస్తాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని హిట్ మ్యాన్ అధిగమిస్తాడు. టెస్టుల్లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ(77 సిక్స్‌లు), ధోని(78) సిక్స్‌లు కొట్టారు. ఇక, ఈ అరుదైన రికార్డు సాధించిన జాబితాలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(90) తొలి స్ధానంలో ఉండగా, రెండు సిక్సులు కొడితే రోహిత్ శర్మ సెకండ్ ప్లేస్ లోకి వెళ్లాడు.