Ind vs SA1st T20I: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్ నేటి (మంగళవారం) నుంచి మొదలు కానుంది. ఈ సిరీస్ తొలి T20 మ్యాచ్ కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా భారత జట్టులోకి శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా తిరిగి వచ్చారు. మెడ పట్టేయడం కారణంగా మూడు వారాలకు పైగా గిల్ ఆటకు దూరంగా ఉన్న శుభ్‌మన్ గిల్ కోలుకొని జట్టులోకి తిరిగి వచ్చాడు. ఇక హార్దిక్ పాండ్యా ఆసియా కప్ 2025లో గాయపడ్డాడు. సంజూ శాంసన్, కుల్‌దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు.
2026 MG Hector టీజర్ విడుదల.. స్పెక్స్, ఫీచర్లు, అంచనా ధరలు ఇవే..!
ఇక మరోవైపు దక్షిణాఫ్రికా జట్టులో కూడా 2024 T20 ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత ఆటకు దూరంగా ఉన్న ఫాస్ట్ బౌలర్ ఎన్రిక్ నోర్ట్జే ఈ మ్యాచ్ ద్వారా తిరిగి వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ఈ కటక్ మ్యాచ్‌తో వచ్చే ఏడాది జరగనున్న T20 ప్రపంచ కప్ కోసం తమ సన్నాహాలను ప్రారంభించింది. 2024లో T20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత భారత్ T20 క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 26 మ్యాచ్ లు గెలవగా.. కేవలం నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది. ఇక ఏ T20 సిరీస్‌నూ ఓడిపోలేదు కూడా. దక్షిణాఫ్రికాపై కూడా ఇదే విజయాన్ని కొనసాగించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.
Top 5 Electric Cars: 2026 లో విడుదల కానున్న టాప్ 5 EVల జాబితా ఇదే.. ఒక లుక్ వేయండి
టాస్ ఓడిపోయిన తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. పర్వాలేదు. మేము వికెట్‌ను చూసి కొంచెం గందరగోళానికి గురయ్యాము. నిన్నటి కంటే ఈ రోజు పిచ్ కొంచెం ఆకుపచ్చగా ఉంది. మేము ముందుగా బ్యాటింగ్ చేయడానికి సంతోషిస్తున్నాము. ఎక్కువ పరుగులు చేసి, వాటిని డిఫెండ్ చేయడం ఒక మంచి ఛాలెంజ్. డ్యూ ఫ్యాక్టర్ (మంచు ప్రభావం) బౌలర్లకు కొంచెం సవాలుగా ఉంటుంది. మేము దానిపై మాత్రమే దృష్టి పెడితే.. ముఖ్యమైన పనిపై ప్రభావం పడుతుందని నేను భావిస్తున్నాను. మేము దాని గురించి ఆలోచించకుండా, ఒక సవాలుగా తీసుకుంటాము అని అన్నారు.
