NTV Telugu Site icon

IND vs PAK: క్యురేటర్ కూడా అయోమయానికి గురవుతున్నాడు: రోహిత్ శర్మ

Rohit Sharma Record

Rohit Sharma Record

Rohit Sharma on New York Pitch Ahead of IND vs PAK Match: : టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత్‌ కీలక పోరుకు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో న్యూయార్క్‌ వేదికగా పాకిస్థాన్‌తో రోహిత్ సేన తలపడనుంది. అయితే నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పిచ్‌పై ఇప్పటికే ఐసీసీకి పలు ఫిర్యాదులు అందినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పిచ్‌లో మార్పులు చేస్తారనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వినిపించాయి. వాటిపై ఐసీసీ క్లారిటీ ఇచ్చింది. పాక్‌తో మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పిచ్‌ గురించి స్పందించాడు.

Also Read: Kalki 2898 AD : కల్కి నుంచి దీపికా పదుకోన్ న్యూ లుక్ వైరల్..

రోహిత్ శర్మ మాట్లాడుతూ… ‘న్యూయార్క్‌ మా సొంత మైదానం కాదు. ఇప్పటివరకు ఇక్కడ రెండు మ్యాచ్‌లను మాత్రమే ఆడాం. పిచ్‌ను అర్థం చేసుకొనేందుకు ఇది సరిపోదు.న్యూయార్క్‌ పిచ్‌ ఒక్కోరోజు ఒక్కోలా ప్రభావం చూపిస్తోంది. పిచ్‌ క్యురేటర్ కూడా అయోమయానికి గురవుతున్నాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ఏ పిచ్‌పై ఆడతామో మాకు తెలియదు. అయితే అత్యుత్తమ ప్రదర్శన చేసిన జట్టునే విజయం వరిస్తుంది. అవుట్‌ ఫీల్డ్‌ కూడా చాలా నెమ్మదిగా ఉంది. కొన్నిసార్లు ఎక్కువ బౌన్స్‌తో బంతి వెళ్తుంది. మరికొన్నిసార్లు పైకి లేవడం లేదు. ఇక్కడ వికెట్ల మధ్య పరుగెత్తడం చాలా ముఖ్యం. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాల్సిన అవసరం ఉంది. ప్రత్యర్థి ఎవరు?, పిచ్‌ ఎలా ఉంది? అనేవి పట్టించుకోకుండా.. నాణ్యమైన క్రికెట్‌ ఆడాలి’ అని అన్నాడు.