NTV Telugu Site icon

IND vs PAK: క్రికెట్ అభిమానులకి బ్యాడ్ న్యూస్.. భారత్‌, పాకిస్తాన్ మ్యాచ్‌ కష్టమే! కారణం ఏంటంటే?

Ind Vs Pak

Ind Vs Pak

Rain may disrupt India vs Pakistan Asia Cup 2023 match on Sep 2: ఆసియా కప్ 2023 ఆరంభం అయింది. బుధవారం ముల్తాన్‌ వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. నేడు పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక భారత్‌, పాకిస్తాన్ జట్ల మధ్య మెగా మ్యాచ్‌ శనివారం (సెప్టెంబర్ 2) జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ జరగడం కష్టమే అని సమాచారం తెలుస్తోంది.

సెప్టెంబర్ 2న భారత్‌, పాకిస్తాన్ మ్యాచ్‌ శ్రీలంకలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని సమచారం. శనివారం కాండీలో వర్షం పడేందుకు 90 శాతం అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో తేమ 84 శాతం ఉంటుందని పేర్కొంది. దీంతో ఆసియా కప్‌ 2023లో అత్యంత ఆసక్తికర పోరు వరుణుడి ఖాతాలోకి చేరుతుందా? అనే అనుమానం అభిమానుల్లో నెలకొంది. చూడాలి మరి వరుణుడు ఏం చేస్తాడో.

సెప్టెంబర్ 2న జరిగే భారత్‌, పాకిస్తాన్ మ్యాచ్‌కి మాత్రమే కాదు.. దాదాపుగా క్యాండీలో జరిగే అన్ని మ్యాచ్‌లకి వర్షం ముప్పు ఉందట. ఈ రోజు బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్‌కి 86 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నాయట. సెప్టెంబర్ 4న భారత్, నేపాల్ మధ్య జరిగే మ్యాచ్‌కి వర్షం ముప్పు 76 శాతం ఉందని తెలుస్తోంది. వర్షం కారణంగా ఫలితాలు కూడా తారుమారయ్యే అవకాశం ఉంది. దాంతో ఆసియా కప్ 2023లో ఆడే ప్రతి మ్యాచ్ కీలకం కానుంది.

Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు! ఏకంగా 60 వేలు

ఆసియా కప్‌ 2023లో పాల్గొనేందుకు భారత జట్టు బుధవారం శ్రీలంకలో అడుగుపెట్టింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ, ఆల్‌రౌండర్‌లు హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా.. పేసర్ మహ్మద్‌ షమీ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సహా జట్టంతా ప్రత్యేక బస్సులో విమానాశ్రయం నుంచి హోటల్‌కు చేరుకుంది. సెప్టెంబరు 2న పాకిస్థాన్‌ మ్యాచ్‌తో భారత్‌ తన ఆసియా కప్‌ 2023 పోరాటాన్ని ఆరంభిస్తుంది.