Site icon NTV Telugu

IND vs PAK: ఓర్నీ మీ దుంపతెగ.. మ్యాచ్ వద్దంటూనే ఇంతమంది పోయారేంట్రా!

Indian Fans

Indian Fans

పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా దాయాది పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్‌ ఆడొద్దని భారత అభిమానులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఆసియా కప్‌ 2025లో భాగంగా నవంబర్ 14న దుబాయ్ వేదికగా మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ‘బాయ్‌కాట్ ఆసియా కప్‌ 2025’, ‘బాయ్‌కాట్ భారత్ vs పాకిస్థాన్‌ మ్యాచ్’ అని ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. ఐసీసీ, ఏసీసీ నిబంధనలకు లోబడి మ్యాచ్ ఆడాల్సిందే అని బీసీసీఐ స్పష్టం చేసింది. బాయ్‌కాట్ ట్రెండ్ నేపథ్యంలో ఇండో-పాక్ మ్యాచ్‌కు 1-2 రోజుల ముందు వరకు పెద్దగా టికెట్స్ కూడా తెగలేదు. అయితే మ్యాచ్ రోజు మాత్రం భారత ఫాన్స్ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Also Read: Duleep Trophy 2025: రజత్ పటీదార్‌ కెప్టెన్సీ మాయ.. దులీప్ ట్రోఫీ విజేతగా సెంట్రల్ జోన్!

బాయ్‌కాట్ పాకిస్థాన్‌ అన్న ఇండియన్ ఫాన్స్ ఆదివారం మాత్రం భారీ ఎత్తున దుబాయ్ స్టేడియంకు వచ్చారు. ఫాన్స్ స్టేడియం లోపలికి వెళ్లే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. క్యూలైన్లో మొత్తం భారత ఫాన్స్ ఏ ఉన్నారు. వీడియోలో 10 మంది కూడా పాకిస్థాన్‌ ఫాన్స్ లేరు. ఈ వీడియోకు భారీగా ట్రోల్స్ వస్తున్నాయి. ‘భారత అభిమానులు సోషల్ మీడియాలో మాత్రమే పాకిస్తాన్‌ను బహిష్కరిస్తున్నారు, మ్యాచ్ చూడటానికి భారీ సంఖ్యలో స్టేడియానికి వస్తున్నారు’ అని ఓ అభిమాని మండిపడ్డాడు. ‘ఓర్నీ మీ దుంపతెగ.. మ్యాచ్ వద్దంటూనే ఇంతమంది పోయారేంట్రా’ అని మరొకరు ట్వీట్ చేశారు. ‘ఇది నిజంగా షాకింగ్’, ‘ఇండియన్ ఫాన్స్ షేమ్ ఫుల్’ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version