IND vs PAK: ఆసియా కప్ చరిత్రలో తొలిసారిగా భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఇప్పటికే ఈ సీజన్‌లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు పాకిస్థాన్‌ను రెండుసార్లు ఓడించి ఆధిపత్యాన్ని చాటుకుంది. నేడు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా (సెప్టెంబర్ 28, ఆదివారం) రాత్రి 8:00 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం జరగనుంది.
Madya pradesh: మరి ఇలా తయారయ్యారేంట్రా బాబు.. ఐదేళ్ల కొడుకుని, భర్తని వదిలి వదినతో మహిళ జంప్
ఇకపోతే భారత జట్టు ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్దూ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరింది. అయితే, సూపర్ ఫోర్ దశలో శ్రీలంకతో జరిగిన చివరి మ్యాచ్‌లో ఎదురైన ఇబ్బందులు జట్టును అప్రమత్తం చేశాయి. ఫైనల్‌కు ముందు సూర్యకుమార్ ఫామ్, శుభమన్ గిల్ స్థిరత్వం లేకపోవడం భారత్‌కు ఆందోళన కలిగించే అంశాలుగా ఉన్నాయి. మరోవైపు, పాకిస్థాన్ జట్టు గత రెండు ఓటముల ఒత్తిడితో ఫైనల్‌లోకి అడుగుపెడుతోంది. టీమిండియా జట్టుతో పోలిస్తే, పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్ బలహీనంగా కనిపిస్తోంది. షాహీన్ షా అఫ్రిదీతో పాటు ఇతర ఆటగాళ్లు ఫైనల్‌లో తమ ప్రభావం చూపిస్తేనే ఏవైనా ఆశలు ఉంటాయి. ఇక ఓపెనర్ అభిషేక్ శర్మ రెండు మ్యాచుల్లో పాక్ బౌలర్లను చిత్తుచేసి, పవర్‌ప్లేలో చెలరేగిపోతుండడంతో భారత్ కు ఓ ప్లస్ గా చెప్పవచ్చు. నేటి మ్యాచ్ కు ఇరుజట్లు ఇలా అంచనా వేయవచ్చు.
Air India Express PayDay Sale: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బంపరాఫర్.. కేవలం రూ.1,200కే విమాన ప్రయాణం..
భారత్ (India): అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, శివం దూబే, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి
పాకిస్థాన్ (Pakistan): సహిబ్‌జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), హుస్సైన్ తలాత్, మహ్మద్ హారిస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్
