NTV Telugu Site icon

IND vs PAK Live Updates: మళ్లీ వర్షం.. మ్యాచ్‌ రిజర్వ్‌ డేకు వాయిదా

Match

Match

IND vs PAK Live Updates: చిరకాల ప్రత్యర్థులైన భారత్‌, పాక్‌ జట్ల మధ్య సూపర్‌ 4 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌ గెలవాలని ఇరు జట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. భారత్‌ను ఎదుర్కొనేందుకు పాకిస్థాన్‌ జట్టులో కీలకమైన బౌలర్లను రంగంలోకి దించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాక్‌ బౌలింగ్ ఎంచుకుంది. ఇక టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. షమీ స్థానంలో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ స్థానంలో కేఎల్‌ రాహుల్ ఆడుతున్నారు. ఎలాగైనా ఈ మ్యాచ్‌ గెలిచేందుకు ఇరుజట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి.

The liveblog has ended.
  • 10 Sep 2023 09:05 PM (IST)

    మళ్లీ వర్షం.. మ్యాచ్‌ రిజర్వ్‌ డేకు వాయిదా

    ఇవాళ భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. సాయంత్రం మొదటి వర్షం పడగా.. కాసేపటికి ఆగిపోవడంతో మైదానాన్ని సిద్ధం చేశారు. ఇదిలా ఉండగానే మళ్లీ వర్షం కురిసింది. దీంతో మ్యాచ్‌ను రిజర్వ్‌ డేకు వాయిదా వేశారు. భారత్‌ ఇన్నింగ్స్‌లో 24.1 ఓవర్ల వద్ద ఉన్నప్పుడు మ్యాచ్‌ నిలిచిపోయింది.రేపు అక్కడి నుంచే మ్యాచ్‌ను కొనసాగించనున్నారు.. నేడు మ్యాచ్‌ ఆగిపోయేసరికి భారత స్కోరు 147/2. క్రీజులో కేఎల్‌ రాహుల్ (17), విరాట్ కోహ్లీ(8) ఉన్నారు.

  • 10 Sep 2023 08:45 PM (IST)

    మళ్లీ వర్షం.. మ్యాచ్‌ రేపటికి వాయిదా పడుతుందా?

    మైదానాన్ని మ్యాచ్‌ నిర్వహణకు సిద్ధం చేయగా.. మళ్లీ వర్షం మొదలైంది. సిబ్బంది మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ఈ రోజు మ్యాచ్‌ తిరిగి ప్రారంభం కాకపోతే రేపటికి వాయిదా పడుతుంది.

  • 10 Sep 2023 08:00 PM (IST)

    నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు

    చంద్రబాబుకు రిమాండ్ విధించడంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. నెల్లూరు, కావలి, గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరులలోని ప్రధాన సెంటర్లలో పోలీసులు మోహరించారు. మరోవైపు నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయం వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందని పోలీసులు తెలుపుతున్నారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, నిరసనలు, దీక్షలు చేయవద్దని హెచ్చరించారు. మరోవైపు జిల్లాలో టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ కొనసాగుతుంది.

  • 10 Sep 2023 07:47 PM (IST)

    మైదానం సిబ్బందితో అంపైర్ల చర్చలు

    అంపైర్లు మైదానంలోకి వచ్చి సిబ్బందితో చర్చలు జరుపుతున్నారు. మైదానంలో ఇంకా తడిగానే ఉంది. ఇప్పుడు వాతావరణం కాస్తా పొడిగా ఉంది. అయితే మ్యాచ్‌పై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

  • 10 Sep 2023 07:22 PM (IST)

    7:30 గంటలకు మైదానాన్ని పరిశీలించనున్న అంపైర్లు

    మైదానంలో చాలా ప్రాంతాల్లో తడిగా ఉంది. ఆ తడిని తొలగించేందుకు సిబ్బంది పెద్ద పెద్ద స్పాంజ్‌లను ఉపయోగిస్తున్నారు. 7:30 గంటలకు మైదానాన్ని అంపైర్లు పరిశీలించనున్నారు. అనంతరం మ్యాచ్‌ను నిర్వహించాలా లేదా రేపటికి వాయిదా వేయాలనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు.

  • 10 Sep 2023 06:09 PM (IST)

    ఆగిపోయిన వర్షం.. మైదానాన్ని పరిశీలించనున్న అంపైర్లు

    మైదానంలో కురుస్తున్న వర్షం ఆగిపోయింది. ప్రస్తుతం సిబ్బంది ఒక్కొక్కటిగా మైదానంలోని కవర్లను తొలగిస్తున్నారు. మరికాసేపట్లో మైదానాన్ని అంపైర్లు పరిశీలించే అవకాశం ఉంది.

  • 10 Sep 2023 04:58 PM (IST)

    మ్యాచ్‌కు అడ్డంకిగా మారిన వరుణుడు

    ముందుగా అనుకున్నట్లుగానే వరణుడు మ్యాచ్‌కు అడ్డంకిగా మారాడు. 24.1 ఓవర్లు పూర్తి అయిన తర్వాత వర్షం మొదలైంది. సిబ్బంది మైదానాన్ని కవర్లతో కప్పేస్తున్నారు.

  • 10 Sep 2023 04:38 PM (IST)

    భారత ఓపెనర్లు ఔట్

    వెంటవెంటనే ఇద్దరు భారత్‌ ఓపెనర్లు రోహిత్ శర్మ(56), శుభ్‌మన్‌ గిల్‌(58)లు ఔటయ్యారు. షాదాబ్‌ ఖాన్‌ వేసిన 16.4 ఓవర్‌కు భారీ షాట్ ఆడబోయి ఫహీమ్‌ అష్రాఫ్‌కు చిక్కాడు. 121 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్‌ను కోల్పోయింది. 18వ ఓవర్‌లో శుభమన్‌ గిల్‌(58) ఔటయ్యాడు. షాహీన్‌ అఫ్రీది వేసిన ఐదో బంతికి అఘా సల్మాన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 20.4 ఓవర్లలో భారత స్కోరు 137/2. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(6), కేఎల్‌ రాహుల్(10) ఉన్నారు.

  • 10 Sep 2023 04:11 PM (IST)

    అర్థశతకాలు పూర్తి చేసిన ఓపెనర్లు

    ఓపెనర్లు రోహిత్ శర్మ(55), శుభమన్‌గిల్(53) ఇద్దరూ అర్థ శతకాలు పూర్తి చేశారు. కెప్టెన్‌ రోహిత్ శర్మ గేర్‌ మార్చి దూకుడుగా ఆడుతున్నాడు. షాదాబ్‌ ఖాన్‌ వేసిన 15వ ఓవర్లలో తొలిబంతికి సిక్స్‌ కొట్టి రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం భారత స్కోరు 15 ఓవర్లలో 115/0.

  • 10 Sep 2023 04:01 PM (IST)

    హాఫ్‌ సెంచరీ చేసిన గిల్

    ఓపెనర్‌ శుభ్‌మన్ గిల్ హాఫ్‌ సెంచరీని పూర్తి చేశారు. 37 బంతుల్లో 50 పరుగులను చేశాడు. రోహిత్‌ శర్మ 44 పరుగులను చేశాడు. ప్రస్తుతం భారత స్కోరు 13 ఓవర్లలో 96/0

  • 10 Sep 2023 03:48 PM (IST)

    భారత్-పాక్‌ మ్యాచ్.. 10 ఓవర్లలో భారత్‌ స్కోరు ఇలా..

    భారత్ 10 ఓవర్లలో 61 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు రోహిత్ శర్మ(18), శుభమన్‌ గిల్‌(41) ఉన్నారు. భారత బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. వీలు దొరికినప్పుడల్లా ఫోర్లు కొడుతూ స్కోరును ముందుకు నడిపిస్తున్నారు.

  • 10 Sep 2023 03:33 PM (IST)

    మెయిడిన్‌ చేసిన నసీమ్‌ షా

    పాక్‌ యువపేసర్‌ నసీమ్ షా తన స్వింగ్‌తో అదరగొట్టేశాడు. ఆరో ఓవర్‌లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మెయిడిన్‌ చేయడం విశేషం.

  • 10 Sep 2023 03:31 PM (IST)

    5 ఓవర్లలో భారత స్కోరు ఇలా.. దూకుడుగా గిల్

    టీమిండియా 5 ఓవర్లలో 37 పరుగులు చేసింది. శుభమన్‌ గిల్ 13 బంతుల్లో 25 పరుగులు చేశాడు. రోహిత్‌ శర్మ ఆచితూచి ఆడుతున్నాడు. రోహిత్ 23 బంతుల్లో 10 పరుగులు చేశాడు.

  • 10 Sep 2023 03:10 PM (IST)

    భారత బ్యాటింగ్ ప్రారంభం

    టాస్‌ ఓడిన భారత జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమన్‌ గిల్ బరిలోకి దిగారు. మొదటి ఓవర్‌ను పాకిస్థాన్‌ బౌలర్ షాహీన్ అఫ్రీది వేశాడు. మొదటి ఓవర్‌లో చివరి బంతిని సిక్స్‌గా మలిచి రోహిత్‌ తన ఖాతాను తెరిచాడు.

Show comments