NTV Telugu Site icon

IND vs NZ: ఎదురుదాడి చేస్తున్న టీమిండియా.. లంచ్ సమయానికి 195/5

Ind Vs Nz

Ind Vs Nz

IND vs NZ: భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో చివరి మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. నేడు మూడు టెస్ట్ రెండవ రోజు సాగుతోంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో రెండో రోజు లంచ్ సమయానికి 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా, శుభ్‌మన్ గిల్ ఉన్నారు. శుభ్‌మన్ 70, జడేజా 10 పరుగులతో ఆడుతున్నారు. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన భారత జట్టు ఇప్పుడు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి క్లీన్‌స్వీప్‌ను తప్పించుకోవాలనుకుంటోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించే విషయంలో కూడా ఈ మ్యాచ్ భారత జట్టుకు చాలా ముఖ్యమైనది.

Also Read: Bomb Threat: సంపర్క్ క్రాంతి రైలుకు బాంబు బెదిరింపు.. భయభ్రాంతులకు లోనైనా ప్రయాణికులు

మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు 84/4 గా ఉంది. రెండో రోజు ఆటలో రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ భారత జట్టు బాధ్యతలు చేపట్టారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 114 బంతుల్లో 96 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. పంత్ కేవలం 36 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. కాగా, శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ మార్కును చేరుకోవడానికి 66 బంతులు తీసుకున్నాడు. పంత్ 59 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో 60 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఇష్ సోధి పంత్‌ను ఎల్‌బీడబ్ల్యూగా పెవిలియన్ కు చేర్చాడు. పంత్ ఔటయ్యే సమయానికి భారత్ స్కోరు 180/5. మొత్తానికి రెండో రోజు లంచ్ సమయానికి 195/5 తో ఉంది. దింతో భారత్ మొదటి ఇన్నింగ్స్ లో ఇంకా 40 పరుగులు వెనుకబడి ఉంది.

Also Read: Unique Tradition: వైరెటీ సంప్రదాయం.. ఆవుల మందతో తొక్కించుకుంటున్న యువకులు