IND vs NZ T20: నాగ్‌పూర్ వేదికగా ఇండియా, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్‌లో అభిమానులకు అసలైన రన్ ఫీస్ట్ దొరికింది. అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఈ మ్యాచ్‌లో భారత జట్టు 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ 35 బంతుల్లోనే 84 పరుగులు చేసి న్యూజిలాండ్ బౌలర్లపై దండయాత్ర సాగించాడు. ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 240 స్ట్రైక్‌రేట్ తో స్టేడియాన్ని ఊపేసాడు.
Astrology: జనవరి 22, గురువారం రాశిఫలాలు ఇలా..
ఇక భారత ఇన్నింగ్స్ లో సూర్యకుమార్ యాదవ్ (32), హార్దిక్ పాండ్యా (25), చివర్లో రింకూ సింగ్ కేవలం 20 బంతుల్లో అజేయంగా 44 పరుగులు చేసి టీమిండియాకు భారీ స్కోర్‌ను అందించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ, కైల్ జేమీసన్ రెండు వికెట్లు తీసినా భారత బ్యాటింగ్ దూకుడికి కట్టడి వేయలేకపోయారు. ఇక 239 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆరంభంలోనే షాక్ తగిలింది.
Tragedy: మరో బస్సు ప్రమాదం.. లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి
డెవన్ కాన్వే, రచిన్ రవీంద్ర తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో ఒత్తిడి పెరిగింది. మధ్యలో గ్లెన్ ఫిలిప్స్ 40 బంతుల్లో 78 పరుగులు చేసి ఆశలు రేపాడు. అతనికి మార్క్ చాప్మన్ (39) కూడా సహకరించినా అవసరమైన రన్‌రేట్ అధికంగా ఉండటంతో న్యూజిలాండ్ లక్ష్యానికి దూరమైంది. భారత బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి, దూబే రెండు వికెట్లు తీయగా, అర్షదీప్ సింగ్ కీలక సమయంలో కాన్వే వికెట్‌తో మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. చివరికి న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులకే పరిమితమైంది. అర్షదీప్, పాండ్యా, అక్షర్ పటేల్‌లకు తలో వికెట్ సాధించారు. ఈ విజయంతో భారత్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది.
A commanding performance! 🔝#TeamIndia win by 4⃣8⃣ runs in Nagpur to take a 1⃣-0⃣ lead in the 5-match T20I series 👏
Scorecard ▶️ https://t.co/ItzV352h5X#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/BuAT0BluHk
— BCCI (@BCCI) January 21, 2026