Mitchell Santner: మా ఓటమికి కారణం ఇదే.. న్యూజిలాండ్ కెప్టెన్ ఓపెన్ కామెంట్స్..

Ind Vs Nz 1st Odi

Ind Vs Nz 1st Odi

Mitchell Santner: న్యూజిలాండ్‌తో (New Zealand) జరిగిన తొలి వన్డేలో టీమిండియా (Team India) 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ (Eden Park, Auckland) వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో గెలిచి ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కివీస్ విధించిన లక్ష్యాన్ని ఛేదించడంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కీలక పాత్ర పోషించాడు. కేవలం 51 బంతుల్లోనే 74 పరుగులు చేసి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు.

ఈ మ్యాచ్‌పై కివీస్ కెప్టెన్ స్పందించాడు. అసలే ఆక్లాండ్‌ పిచ్‌.. అందులోనూ అనుకున్నదానికంటే ఎక్కువ బౌన్స్‌, పైగా కాస్త వేగంగా దూసుకొచ్చిన బాల్స్‌తో తమ బ్యాటర్లు ఏమాత్రం సర్దుకోలేకపోయారని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఓపెన్‌గానే ఒప్పుకున్నాడు. భారత్ బౌలర్లు (India bowlers) కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతోనే తాము తక్కువ స్కోరుకే కుప్పకూలాల్సి వచ్చిందన్నాడు. ఈడెన్ పార్క్‌లో (Eden Park) పిచ్‌ బౌన్స్‌తో అధికంగా ఉందని.. దాన్ని ఇండియన్ బౌలర్లు బాగా ఉపయోగించుకున్నారని సాంట్నర్ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ షార్ట్ బాల్స్‌ను (short balls) చాలా చక్కగా ఆడాడని, వర్షం పడిన తర్వాత పిచ్ మరింత వేగంగా స్కిడ్ అయిందని పేర్కొన్నాడు. అయితే, టీమిండియా ఆరంభం చూశాక తమ జట్టు చేతులెత్తేస్తుందని అంతా అనుకున్నారని, కానీ తమ పేసర్లు (fast bowlers) మాత్రం చివరి వరకు బాగా ఫైట్ చేశారని సాంట్నర్ మెచ్చుకున్నాడు. మ్యాచ్ చివర్లో కొన్ని మంచి విషయాలు నేర్చుకున్నామని, ఈ పాజిటివ్ ఎనర్జీతోనే తాము వెల్లింగ్టన్‌కు (Wellington) వెళ్తున్నామని ధీమా వ్యక్తం చేశాడు.

మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) బౌలింగ్ ఎంచుకోగా, మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) నాయకత్వంలోని న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. భారత అద్భుతమైన బౌలింగ్‌తో కివీస్ 185 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా యంగ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) 70 పరుగులిచ్చి 4 వికెట్లతో చెలరేగి న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌ను (T20I series) 3-2తో గెలుచుకున్న భారత్, ఈ వన్డే సిరీస్‌ను కూడా విజయంతో ప్రారంభించింది. జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) లేకపోవడంతో బౌలింగ్ లోతుపై ఉన్న అనుమానాలకు ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా గట్టి సమాధానమే ఇచ్చింది. స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగింది భారత్.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ (DLS) పద్ధతిలో భారత్‌కు 32 ఓవర్లలో 143 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. టీమిండియా మరో 56 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.