IND vs NZ: ఆక్లాండ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ జట్టు 185 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కివీస్ బ్యాటర్లను కట్టడి చేశారు. ముఖ్యంగా అర్ష్‌దీప్ సింగ్ 4 వికెట్లతో సత్తా చాటగా, గుర్నూర్ బ్రార్ 3 వికెట్లు పడగొట్టాడు. అన్షుల్ కాంబోజ్ 2 వికెట్లతో రాణించాడు.
టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత బౌలర్లు ఆ నిర్ణయాన్ని సరైందేగా చేస్తూ.. ఆరంభం నుంచే వికెట్లు తీస్తూ న్యూజిలాండ్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. టిమ్ సీఫెర్ట్ 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. డారిల్ మిచెల్ 28 పరుగులు చేయగా, గ్లెన్ ఫిలిప్స్ 30 పరుగులు సాధించాడు. మరోవైపు రోహిత్ శర్మ అద్భుతమైన ఫీల్డింగ్‌తో డారిల్ మిచెల్‌ను రనౌట్ చేయడం మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 39 ఏళ్ల వయసులోనూ వేగంగా కదులుతూ డైవ్ చేసి విసిరిన త్రోతో మిచెల్‌ను పెవిలియన్‌కు పంపడంలో కీలక పాత్ర పోషించాడు.
మరోవైపు కోహ్లీ కూడా ఫిలిప్స్ ను అద్భుతంగా ఒంటి చేతఁజో క్యాచ్ పాటి పెవిలియన్ చేర్చాడు. అయితే చివర్లో బ్లెయిర్ టిక్నర్ 23 బంతుల్లో 34 పరుగులు చేసి న్యూజిలాండ్ స్కోరును బాగా పెంచాడు. చివరకు భారత బౌలర్ల ధాటికి కివీస్ ఇన్నింగ్స్ 40.2 ఓవర్లలో 185 పరుగుల వద్ద ముగిసింది. దీంతో టీమిండియా ముందు 186 పరుగుల లక్ష్యం సాధించాల్సి ఉంది.
𝐓𝐇𝐀𝐓’𝐒 𝐀𝐑𝐒𝐇𝐃𝐄𝐄𝐏 𝐒𝐈𝐍𝐆𝐇 𝐀𝐆𝐀𝐈𝐍, 𝐀𝐍𝐃 𝐇𝐄 𝐆𝐄𝐓𝐒 𝐓𝐇𝐄 𝐁𝐈𝐆 𝐅𝐈𝐒𝐇! 🎙️
Just when New Zealand looked to build momentum, Arshdeep Singh produced the golden touch Team India desperately needed!
Watch the HERO VIDA India Tour of New Zealand 1st ODI, LIVE NOW on Sony Sports Network TV channels, Sony LIV & Sony Vizha.
#SonySportsNetwork #SonyLIV #SonyVizha #NZvIND
— Sony Sports Network (@SonySportsNetwk) November 4, 2026

