NTV Telugu Site icon

IND vs ENG: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. విరాట్‌ కోహ్లీ దూరం!

Virat Kohli Test Shot

Virat Kohli Test Shot

Virat Kohli opted out of England Tests: ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి రెండు టెస్ట్‌లకు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమయిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాల కారణంగా విరాట్ తప్పుకున్నాడని, మిగిలిన మూడు టెస్టులకు అతడు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ తెలిపింది. అయితే విరాట్ ఇంగ్లండ్‌తో జరిగే చివరి మూడు మ్యాచ్‌లకు కూడా అందుబాటులో ఉండడని సమాచారం తెలుస్తోంది. చివరి మూడు టెస్ట్‌లకు నేడు భారత జట్టును బీసీసీఐ ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విరాట్ ఎంట్రీపై ఆసక్తి నెలకొంది.

విరాట్ కోహ్లీ తల్లి సరోజ్‌ కోహ్లీ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని, ఆమెను దగ్గరుండి చూసుకునేందుకే కింగ్ మిగతా టెస్ట్‌లకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తొలి రెండు టెస్ట్‌ల నుంచి కోహ్లీ తప్పుకోవడానికి కారణం అనుష్క శర్మ ప్రెగ్నెన్సీనే అని అందరూ ముందుగా అనుకున్నా.. తల్లి అనారోగ్యం అని తాజాగా తెలుస్తోంది. చివరి మూడు టెస్ట్‌లకు బుధవారం జట్టును ప్రకటించాల్సి ఉన్నా.. విరాట్‌ నుంచి ఇప్పటివర​కు ఎలాంటి సమాచారం లేదని ఓ బీసీసీఐ ప్రతినిధి మీడియాకు చెప్పారు.

Also Read: Hotel Cheating: హోటల్‌ బిల్లు రూ.6 లక్షలు.. బ్యాంకు ఖాతాలో 41 రూపాయలు మాత్రమే! ఏపీ మహిళ మోసం

ఒకవేళ విరాట్ కోహ్లీ ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్ట్‌లకు దూరమైతే టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ​ అనే చెప్పాలి. గాయాల కారణంగా ఇప్పటికే కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా సేవలను రెండో టెస్ట్‌కు కోల్పోయిన భారత్‌.. కోహ్లీ కూడా దూరమైతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. భారత బ్యాటర్ల ఫామ్ కూడా ఆందోళన కలిగిస్తోంది. మొదటి టెస్ట్ ఛేదనలో కోహ్లీ ఉంటే. ఫలితం మరోలా ఉండేదే. వికెట్ల పతనాన్ని విరాట్ అడ్డుకునేవాడు. విరాట్ అందుబాటులో ఉంటాడో లేదో మరికొద్ది గంటల్లో తెలిసిపోనుంది.