NTV Telugu Site icon

Rohit Sharma: అతడి వల్లే ఓడిపోయాం.. ఉప్పల్ టెస్ట్ ఓటమిపై రోహిత్ శర్మ!

Rohit

Rohit

Rohit Sharma React on Hyderabad Test Defeat: హైదరాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్‌కు షాక్‌ తగిలింది. ఆదివారం నాటకీయ పరిణామాల మధ్య ముగిసిన మొదటి టెస్టులో 28 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ చేతిలో పరాజయం పాలైంది. 230 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లీష్ స్పిన్నర్‌ టామ్‌ హార్ట్‌లీ (7/62) దెబ్బకు టీమిండియా 202 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టెస్టు ఫిబ్రవరి 2న విశాఖపట్నంలో ఆరంభమవుతుంది. భారత్ ఓటమిపై టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు. రెండో ఇన్నింగ్స్‌లో పేలవ బ్యాటింగ్ తమ ఓటమిని శాసించిందన్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్ ఓలి పోప్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడని ప్రశంసించాడు.

మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ… ‘నాలుగు రోజులు జరిగిన ఈ మ్యాచ్‌లో ఎక్కడ తప్పు జరిగిందో గుర్తించడం కష్టం. 190 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడంతో ఇక గేమ్‌ మాదే అనుకున్నాము. కానీ ఓలి పోప్ అసాధారణ బ్యాటింగ్‌తో మాకు విజయాన్ని దూరం చేశాడు. భారత పరిస్థితుల్లో నేను చూసిన ఓవర్‌సీస్ ప్లేయర్ అత్యుత్తమ ఇన్నింగ్స్‌ పోప్‌దే. పోప్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 230 పరుగులు పెద్ద లక్ష్యమేమి కాదు. పిచ్‌ కూడా బ్యాటింగ్‌కు అనుకూలించిది. కానీ మేము బ్యాటింగ్‌లో విఫలమకావడంతో టార్గెట్‌ను ఛేజ్‌ చేయలేకపోయాం’ అని తెలిపాడు.

Also Read: Filmfare Awards 2024: ‘యానిమల్‌’ చిత్రానికి అవార్డుల పంట.. ఉత్తమ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌!

‘మా బౌలర్లు అద్బుతంగా బౌలింగ్‌ చేశారు. ప్రణాళికలను అమలు చేయడంలో బౌలర్లు విజయవంతమయ్యారు. మేం ఏ ప్రదేశాల్లో బౌలింగ్ చేశామో స్వయంగా వెళ్లి పరీక్షించాను. సరైన ప్రదేశాల్లో బౌలింగ్ చేశాం. కానీ ఓలి పోప్‌ అద్భుత పోరాటంతో అడ్డుగా నిలిచాడు. మేము ఒక టీమ్‌గా విఫలమయ్యాం. నేను మ్యాచ్‌ను ఐదో​ రోజు వరకు తీసుకువెళ్లాలనుకున్నాను. కానీ వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో నాలుగు రోజుల్లోనే ముగిసిపోయింది. మా లోయర్డ్‌ ఆర్డర్‌ బ్యాటర్లు ఆఖరివరకు పోరాడారు’అని రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు.