NTV Telugu Site icon

Rinku Singh: 2వ టెస్ట్ మ్యాచ్‌కు రింకూ సింగ్‌!

Rinku Singh

Rinku Singh

Rinku Singh added to India A squad: టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్‌ భారత్-ఏ జట్టుతో కలిశాడు. జనవరి 24 నుంచి ప్రారంభమయ్యే 2వ అనధికారిక నాలుగు రోజుల టెస్ట్‌లో ఇంగ్లండ్ లయన్స్‌తో తలపడే భారత జట్టులో అతడు ఆడనున్నాడు. ఇంగ్లండ్ లయన్స్ ప్రస్తుతం మూడు అనధికారిక టెస్టు పర్యటనలో భాగంగా భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మొదటి అనధికారిక టెస్ట్ డ్రాగా ముగిసింది. రజత్ పాటిదార్, కేఎస్ భారత్ సెంచరీలతో భారత్ డ్రా చేసుకుంది.

రింకూ సింగ్ ఫస్ట్‌క్లాస్ రికార్డు బాగుంది. 65 ఇన్నింగ్స్‌లలో 57.57 సగటుతో 3109 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక భారత్ తరఫున టీ20ల్లో రింకూ చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ముగిసిన అఫ్గాన్ సిరీస్‌లో ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు 15 టీ20ల్లో 356 రన్స్ చేశాడు. అత్యధిక స్కోర్ 69 నాటౌట్. ఇక రెండు వన్డేల్లో 55 పరుగులు చేశాడు.

Also Read: Glenn Maxwell: పూటుగా తాగి ఆస్పత్రి పాలైన మ్యాక్స్‌వెల్‌.. దర్యాప్తుకు ఆదేశించిన క్రికెట్ ఆస్ట్రేలియా!

2వ అనధికారిక టెస్టు మ్యాచ్‌కు భారత ‘ఎ’ జట్టు:
అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, తిలక్ వర్మ, కుమార్ కుషాగ్రా, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, విద్వాత్ కావరప్ప, ఉపేంద్ర యాదవ్, ఆకాశ్ దీప్, యశ్ దయాల్, రింకు సింగ్.