NTV Telugu Site icon

IND vs ENG: టీం నుండి కోహ్లీ, పంత్ అవుట్.. మొదట బ్యాటింగ్ చేయనున్న టీమిండియా

Ind Vs Eng (1)

Ind Vs Eng (1)

IND vs ENG: భారత్, ఇంగ్లాండ్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నేటి నుంచి నాగ్‌పూర్‌లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక టీమిండియా నుండి హర్షిత్ రాణా, యశస్వి జైస్వాల్ భారత్ తరఫున అరంగేట్రం చేయబోతున్నారు. గాయం కారణంగా విరాట్ కోహ్లీ ఆడటం లేదు. 2025 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇరు జట్ల మధ్య ఇదే చివరి వన్డే సిరీస్. దీనిని ఛాంపియన్స్ ట్రోఫీకి రిహార్సల్‌గా చూస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత రంజీ ట్రోఫీలో కూడా విఫలమైన రోహిత్ శర్మ ఆటలోకి దిగనున్నారు. అంతకుముందు భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగగా.. ఆతిథ్య భారత జట్టు సిరీస్‌ను 4-1 తేడాతో గెలుచుకున్న సంగతి తెలిసిందే.

Also Read: Shekar Bhasa : బిగ్ బాస్ ఫేమ్ RJ శేఖర్ బాషా పై నార్సింగి పీస్ లో మరో కేసు నమోదు

ఇక నేటి నాగ్‌పూర్ వన్డేలో భారత్-ఇంగ్లాండ్ జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఇలా ఉంది:

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ

ఇంగ్లాండ్: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్